ఏపీపీఎస్సీ పరీక్షలకు రివైజ్డ్‌ ‘కీ’లు

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): వివిధ రిక్రూట్‌మెంట్లకు సంబంధించి నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల రివైజ్డ్‌ ‘కీ’లను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో వీటిని విడుదల చేసినట్లు కమిషన్‌ తెలిపింది. వీటిపై అభ్యంతరాలను డిసెంబరు 3లోగా పంపింపాలని కోరింది. ఈ ఏడాది ఆగస్టు 1న ని




నిర్వహించినసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ మెయిన్స్‌లో 22 ప్రశ్నలను తొలగించి, 3 ప్రశ్నల ఆప్షన్లు మార్చారు. ఆగస్టు 26న నిర్వహించిన పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్‌-4) మెయిన్స్‌లో 8 ప్రశ్నల ఆప్షన్లను మార్చారు. ఈ ఏడాది మే 28-29 తేదీల్లో నిర్వహించిన ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ పరీక్షలో 3 ప్రశ్నలను తొలగించి, 16 ప్రశ్నల ఆప్షన్లను మార్చారు. కాగా, ఏపీ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సర్వీసె్‌సలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ) పోస్టులు, ఏపీ ఇన్ఫర్మేషన్‌ 


సర్వీసె్‌సలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్స్‌ పోస్టుల పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ లిస్టులను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీపీఎస్సీ పరీక్షలకు రివైజ్డ్‌ ‘కీ’లు"

Post a Comment