చంద్రయాన్-3.. ఎప్పుడంటే?
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'చంద్రయాన్-2' చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తి విఫలమైన విషయం తెలిసిందే. ఇందులోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కాలేకపోయింది. అయితే చంద్రుడిపై కాలుమోపాలన్న ఇస్రో సంకల్పం మాత్రం ఇంకా బలంగానే ఉంది. మరోసారి చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టేందుకు 'చంద్రయాన్-3 'దిశగా ఆ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ నాటికి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఇస్రో సిద్ధమవుతోంది.
ప్రతిపాదిత 'చంద్రయాన్-3'కి సంబంధించి నివేదికను తయారు చేయాలని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్.సోమనాథ్ నేతృత్వంలోని కమిటీని ఇస్రో అడిగినట్లు సమాచారం
సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో చివరి నిమిషంలో దానితో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆర్బిటర్ మాత్రం తనకు అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహిస్తోంది

0 Response to "చంద్రయాన్-3.. ఎప్పుడంటే?"
Post a Comment