ఆరోగ్యశ్రీ సేవలపై ఇక డయల్ యువర్ సీఈఓ
గుంటూరు, అక్టోబర్ 7: వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి వివిధ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రతి గురువారం 'డయల్ యువర్ సీఈఓ' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ఎ మల్లిఖార్జున పేర్కొన్నారు.
సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు అత్యంత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజల చెంతకు చేరుస్తున్నట్లు తెలిపారు.
ప్రతి గురువారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ సీఈఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తద్వారా ప్రజలకు ఈ పథకం కింద పొందే సేవలకు సంబంధించి అవగాహన కల్పించడమే కాకుండా, ఆయా ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు
0863-2341666 నెంబర్‌కు నిర్ణీత సమయంలో కాల్‌చేసి సద్వినియోగం చేసుకోవాలని మల్లిఖార్జున కోరారు
AROGYASRI
HELP LINE
EVERY Thursday
4 to 5 pm
Any problems
Discuss
Download
Clipping
CVP
0 Response to "ఆరోగ్యశ్రీ సేవలపై ఇక డయల్ యువర్ సీఈఓ"
Post a Comment