బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ విలీనం
కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం
దిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలను విలీనం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయాలను టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ సంస్థలను మూసివేయడమో లేదా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. మార్కెట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని పోటీలోకి తీసుకెళ్లాలని నిర్ణయించాం
రూ. 29,937కోట్లతో ఈ సంస్థల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో బాండ్ల ద్వారా రూ. 15వేల కోట్లు సేకరించడం, రూ. 38,000 కోట్ల విలువైన ఆస్తులను మానిటైజ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేగాక.. ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఆకర్షణీయమైన వాలెంటరీ రిటైర్మెంట్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామని తెలిపారు
0 Response to "బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ విలీనం"
Post a Comment