నేడు ఎన్నికల ఫలితాలు
- వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాలకు...
న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం, 16 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాలకు, రెండు పార్లమెంటు స్థానాలకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు (గురువారం) తేలనున్నాయి. గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్లలెక్కింపు ప్రారంభం కానుంది. అయితే, ఓట్ల లెక్కింపు రౌండ్‌లలో మధ్యాహ్నం వరకే ఫలితాల సరళి తేలిపోనున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ(288 స్థానాలు) ఎన్నికల్లో పోలింగ్.. 63శాతం నుంచి 60శాతానికి పడిపోగా.. హర్యానా(90 స్థానాలు)లో 76శాతం నుంచి 65 శాతానికి తగ్గిపోయింది

అలాగే, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్ 57శాతంగా నమోదైంది. యూపీ(11 స్థానాలు), గుజరాత్(ఆరు స్థానాలు), బీహార్(ఐదు స్థానాలు), అసోం(నాలుగు స్థానాలు), హిమాచల్ ప్రదేశ్(రెండు స్థానాలు), తమిళనాడు(రెండు స్థానాలు), పంజాబ్(నాలుగు స్థానాలు), కేరళ (ఐదు స్థానాలు), సిక్కిం(మూడు స్థానాలు), రాజస్థాన ్(రెండు స్థానాలు), అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కో స్థానం చొప్పున పోలింగ్ జరిగింది
0 Response to "నేడు ఎన్నికల ఫలితాలు"
Post a Comment