క్రోమ్‌లో ఈ ట్రిక్ ప్రయత్నించారా?
ఇంటర్నెట్‌డెస్క్: మీరు డెస్క్‌టాప్ వినియోగదారులా?అందులోనూ ఎక్కువగా మ్యూజిక్/వీడియోలు చూస్తుంటారా? అయితే ఈ ట్రిక్ మీకోసమే. చాలా మంది డెస్క్‌టాప్ వినియోగదారులు ఒకేసారి అనేక టాబ్‌లను వినియోగిస్తుంటారు. ఒకదానిలో మ్యూజిక్, ఇంకోదాన్లో వీడియోలు, మరో దాన్లో లైవ్ టీవీ చూస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఆ మ్యూజిక్‌ను ఆపడమో లేదా మార్చడమో చేయాలనుకుంటాం. కానీ అది ఏ టాబ్‌లో ప్లే అవుతోందో తెలీక తికమక పడుతుంటాం. అలాంటి తంటాలు పడకుండా ఉండేందుకు గూగుల్.. క్రోమ్‌లో ఓ కొత్త ఫీచర్‌ను జోడించింది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్‌ను మీరూ ఉపయోగించాలనుకునే ముందు మీరు క్రోమ్ 77కి అప్‌డేట్ అవ్వాల్సి ఉంటుంది
మీ బ్రౌజర్ అప్‌టూడేట్‌లో ఉందో లేదో చెక్ చేసుకునేందుకు క్రోమ్ బ్రౌజర్‌లో హెల్ప్ మెనూలో 'అబౌట్ క్రోమ్'లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
ఇలా చేయండి..
* ముందుగా క్రోమ్ బ్రౌజర్‌లో అడ్రస్ బార్‌లోchrome://flags/ అని టైప్ చేయండి.
* అక్కడ ప్రత్యక్షమయ్యే సెర్చ్ బాక్స్‌లోGlobal Media Controls అని సెర్చ్ చేయండి.
* ప్రత్యక్షమయ్యే డ్రాప్‌డౌన్ బాక్స్‌లో డిజేబుల్‌లో ఉన్న ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి.
* వెంటనే రీలాంచ్ అనే ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని నొక్కడం ద్వారా క్రోమ్ బ్రౌజర్ రీస్టార్ట్ అవుతుంది.
* ఒకసారి క్రోమ్ బ్రౌజర్ తెరుచుకున్నాక టూల్‌బార్‌లో మీకు మ్యూజిక్ ప్లే/పాజ్ బటన్ ప్రత్యక్షమవుతుంది.
* ఆ బటన్‌పై ప్రెస్ చేసినప్పుడు మీ బ్రౌజర్ టాబ్‌లలో ప్లే అవుతున్న లేదా ఆగి ఉన్న ఆడియో/వీడియో కంటెంట్ అక్కడ చూపెడుతుంది.
* అందులో ఏ టాబ్‌ను మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లే చేయడం ద్వారా సులభంగా మ్యూజిక్‌ను కంట్రోల్ చేయొచ్చు. ఓ సారి ప్రయత్నించండి

0 Response to "క్రోమ్‌లో ఈ ట్రిక్ ప్రయత్నించారా?"
Post a Comment