ఆండ్రాయిడ్‌ 10కి అప్‌గ్రేడ్‌ ఇలా

ఆండ్రాయిడ్‌ తన తాజా వెర్షన్‌ ఆండ్రాయిడ్‌10కి స్టేబుల్‌ వెర్షన్‌ గత నెల 3న విడుదల చేసింది. మార్చి నెలలో బీటా వెర్షన్‌గా విడుదలైన ఆండ్రాయిడ్‌ 10లో చాలా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లున్నాయి. లైవ్‌ క్యాప్షన్‌, స్మార్ట్‌ రిప్లయి, డార్క్‌మోడ్‌, కొత్త గెస్చర్‌ నావిగేషన్స్‌, ఫోకస్‌ మోడ్‌, ఫ్యామిలీ లింక్‌, కొత్త ప్రైవసీ కంట్రోల్స్‌ ఆండ్రాయిడ్‌ 10లో మనకు కొత్తగా వచ్చాయి. ఇక అప్‌గ్రేడ్‌ విషయానికొస్తే... గూగుల్‌ పిక్సెల్‌, ఆ తర్వాతి వెర్షన్లకు, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 10, ఆ తర్వాతి వెర్షన్లకు, వన్‌ప్లస్‌ 7, ఆ తర్వాతి వెర్షన్లకు, నోకియా 8.1 ఫోన్లకు, నోకియా 7.1, నోకియా 9 ప్యూర్‌ వ్యూలకు కూడా వచ్చే అవకాశం ఉంది. రెడ్‌మీ కే 20 ప్రోలో ఎంఐయూఐ 11 ఓఎస్‌ ఉంది

దీనిలో చాలావరకూ ఆండ్రాయిడ్‌ 10 ఫీచర్లే ఉన్నాయి. హువావేలో 33 డివైస్‌లకు ఆండ్రాయిడ్‌ 10 అప్‌డేట్‌ రాబోతోంది. ఇందులో కొన్ని హానర్‌ ఫోన్లూ ఉండబోతున్నాయి. తొలిగా హువావే మేట్‌ 20 ప్రోకి అందుబాటులోకి రానుంది.


అంతేకాదు.. ఆండ్రాయిడ్‌ 10 అప్‌గ్రేడ్‌కు అవకాశం ఉంటే అప్‌డేట్‌ వచ్చినట్లు నోటిఫికేషన్‌ వస్తుంది. లేదంటే మీరు ఫోన్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అబౌట్‌ ఫోన్‌ సెక్షన్‌లోకి వెళ్లి, మీ ఫోన్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. మీ ఫోన్లకు ఆండ్రాయిడ్‌ 10 అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ అందుబాటులో ఉంటే దాన్ని డౌన్‌లోడ్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆండ్రాయిడ్‌ 10కి అప్‌గ్రేడ్‌ ఇలా"

Post a Comment