బిల్డ్ ఏపీ' పేరుతో కొత్త పథకం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 'బిల్డ్ ఏపీ' పేరుతో కొత్త మిషన్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ఎన్‌బీసీసీ సంస్థతో కలిసి 'బిల్డ్ ఏపీ' కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మిషన్‌లో భాగంగా ప్రభుత్వ భూములు గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే యోచనలో సర్కార్ ఉంది. మిగతా భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మార్కెట్ ధరకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను సేకరించనుంది
ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. 'బిల్డ్ ఏపీ మిషన్ డైరక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. ఈ అంశంపై బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది

0 Response to "బిల్డ్ ఏపీ' పేరుతో కొత్త పథకం"
Post a Comment