వాట్సాప్‌నే వాట్సప్ అని అడిగితే
ఎవరినైనా కలవగానే వాట్సప్ అని పలకరిస్తాం. అంటే - ఏంటి విశేషాలు అని అర్థం. అసలు వాట్సప్ అన్న మాటతోనే యాప్ అన్న మాటను కూడా కలిపి వాట్సాప్‌కి నామకరణం జరిగింది. మరి మనం వాట్సాప్‌నే వాట్సప్ అని అడిగాం అనుకోండి. ఏంటి కొత్త విశేషాలు? అనగానే ఇప్పుడు చెప్పడానికి వాట్సాప్ రెడీగా ఉంది. త్వరలో వాట్సాప్‌లో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు రాబోతున్నాయ్
ఈ ఫీచర్స్‌లో డిస్-అపియరింగ్ మెసేజెస్ అన్నది ముఖ్యంగా వినిపిస్తోంది. అంటే... ఇలా కనిపించి అలా మాయమైపోయే మెసేజెస్ అన్నమాట! అయితే అదొక్కటే కాదు. ఇంకా డార్క్ మోడ్ ఫీచర్, కాంటాక్ట్ ర్యాంకింగ్, బూమరాంగ్ వీడియోస్ లాంటి అనేక ఫీచర్లు త్వరలో వాట్సాప్‌కి జతపడబోతున్నాయి.
రాత్రుళ్లు వాట్సాప్ వాడేవాళ్లకి కళ్లకి ఇబ్బంది కలక్కుండా డార్క్‌మోడ్ ఉపయోగపడుతుంది. సాధారణంగా వాట్సాప్‌లో లేటెస్ట్ మెసేజ్ పంపిన కాంటాక్ట్... లిస్టులో పైన ఉంటుంది. ఇందువల్ల మనకి అంత ఇంపార్టెంట్ కాని కాంటాక్ట్ గానీ.. గ్రూప్ గానీ లిస్ట్‌లో పైకి వచ్చి.. ముఖ్యమైనవారి మెసేజ్‌లు ఎక్కడో కింద ఉండిపోయే ప్రమాదం ఉంది. అందుకే మనం ఎక్కువగా చాట్ చేసే కాంటాక్ట్స్‌ని టాప్ లో ఉంచుకునే కాంటాక్ట్ ర్యాంకింగ్ సదుపాయం రాబోతోంది.
ఫేస్‌బుక్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ మళ్లీ ప్లే అవుతుండే లూప్ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిని బూమరాంగ్ వీడియోస్ అంటారు. ఇలాంటి ఫీచర్ వాట్సాప్‌లో కూడా రాబోతోంది
0 Response to "వాట్సాప్‌నే వాట్సప్ అని అడిగితే"
Post a Comment