త్వరలో వాట్సాప్‌లో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు

*✨ వాట్సాప్‌* 

★ త్వరలో వాట్సాప్‌లో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు రాబోతున్నాయ్‌.
 
★ ఈ ఫీచర్స్‌‌లో డిస్‌-అపియరింగ్‌ మెసేజెస్‌ అన్నది ముఖ్యంగా వినిపిస్తోంది. అంటే... ఇలా కనిపించి అలా మాయమైపోయే మెసేజెస్‌ అన్నమాట! 

★ ఇంకా డార్క్‌ మోడ్‌ ఫీచర్‌, కాంటాక్ట్‌ ర్యాంకింగ్‌, బూమరాంగ్‌ వీడియోస్‌ లాంటి అనేక ఫీచర్లు త్వరలో వాట్సాప్‌కి జతపడబోతున్నాయి.
 
★ రాత్రుళ్లు వాట్సాప్‌ వాడేవాళ్లకి కళ్లకి ఇబ్బంది కలక్కుండా డార్క్‌మోడ్‌ ఉపయోగపడుతుంది. 


★ సాధారణంగా వాట్సాప్‌లో లేటెస్ట్‌ మెసేజ్‌ పంపిన కాంటాక్ట్‌... లిస్టులో పైన ఉంటుంది. ఇందువల్ల మనకి అంత ఇంపార్టెంట్‌ కాని కాంటాక్ట్‌ గానీ.. గ్రూప్‌ గానీ లిస్ట్‌లో పైకి వచ్చి.. ముఖ్యమైనవారి మెసేజ్‌లు ఎక్కడో కింద ఉండిపోయే ప్రమాదం ఉంది.

★ అందుకే మనం ఎక్కువగా చాట్‌ చేసే కాంటాక్ట్స్‌ని టాప్‌ లో ఉంచుకునే కాంటాక్ట్‌ ర్యాంకింగ్‌ సదుపాయం రాబోతోంది.
 
★ ఫేస్‌బుక్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ మళ్లీ ప్లే అవుతుండే లూప్‌ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిని బూమరాంగ్‌ వీడియోస్‌ అంటారు. ఇలాంటి ఫీచర్‌ వాట్సాప్‌లో కూడా రాబోతోంది.

              🌿🌼🌸🌸🌼🌿
░▒▓█ CVP█▓▒░

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "త్వరలో వాట్సాప్‌లో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు"

Post a Comment