నేటి రేడియో పాఠం

📻📻📻📻📻📻📻

*♦విందాం నేర్చుకుందాం* 

*🔹నేటి రేడియో పాఠం*

*🔸దారి తెలుసుకుందాం*

*🔹4వ తరగతి ( పరిసరాల విజ్ఞానం)*

14-10-19

💁‍♂ *"విందాం - నేర్చుకుందాం"*
📻 *నేటి రేడియో పాఠం*
★ తేది : 14.10.2019
★ విషయము : పరిసరాల విజ్ఞానం
★ పాఠం పేరు : "దారి తెలుసుకుందామా!"
★ తరగతి : 4వ తరగతి
★ సమయం : 11-00 AM 
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰 
✳ *దారి తెలుసుకుందామా!* 
〰〰〰〰〰〰〰〰 
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• విద్యార్థులు దిక్కులను గురించి తెలుసుకుంటారు.
• విద్యార్థులు మూలలను గురించి తెలుసుంటారు.
• పటం తయా రీ గురించి తెలుసుకుంటారు.
• గ్రామం, మండలం మరియు జిల్లా సరిహద్దులు గురించి అవగాహవ చేసుకుంటారు. 
★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
• సుద్దముక్క, నల్లబల్ల.
★★★★★★★★
✡ *కృత్యం -ఆట :*
 *కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి.*
*కృత్యం-1:*
• విద్యార్థులను వరుసగా నిలబడమనండి.
• టీచర్ మీకు విద్యార్థులకు అందే విధంగా దిక్కులు, మూలలు కు సంబంధించిన పటాన్ని మాత్రమే గీయండి.
   /+/
• విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా టేబుల్ పై సుద్దముక్క ఉంచండి. 
• రేడియోలో దిక్కులు 4. మూలలు 4, దిక్కులు, 4, మూలలు 4, దిక్కులు 4 , మూలలు 4 అవి వస్తుంది.
• రేడియో లో చెప్పిన దిక్కు పేరులోని మొదటి అక్షరాన్ని నల్లబల్లపై గీసిన పటంలో సరైన చోట రాయాలి.
ఉదా: దిక్కులు 4 -మూలలు 4, దిక్కులు 4 -మూలలు 4  నేను చెప్పే దిక్కు ఉత్తర దిక్కు అని రేడియోలో వస్తే విద్యార్థి  *ఉ"   అని నల్లబల్లపై గుర్తించి రాయాలి
★★★★★★★★
*ఆట*
✡ *ఈ కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించే విధానాన్నీ తెలుసుకొని ఉండాలి*
ఆట పేరు : “గోడకు వెళ్ళండి”.
*ఆట ఆడించే విధానం :*
• టీచర్ మీ తరగతి లోని 4 గోడలను, తూర్పుగోడ, పడమర గోడ, ఉత్తర గోడ, దక్షిణ గోడ అని విద్యార్థులకు పరిచయం చేయాలి. 
• తదుపరి విద్యార్థులను తరగతి గది మధ్యలో నిలబడమనండి.
• రేడియో లో వెళ్ళండి - వెళ్ళండి, వెళ్ళండి - వెళ్ళండి వెళ్ళండి- వెళ్ళండి  "తూర్పు గోడకు వెళ్ళండి" అని వస్తుంది. అపుడు విద్యార్థులు తూర్పు గోడ వద్దకు వెళ్లేలా  చూడండి.
• ఇలా రేడియో లో చెప్పిన దిక్కున గోడ వద్దకు ప్రతిసారీ విద్యార్థులు వెళ్లేలా చూడండి.  
• ఇలా వెళ్లలేని విద్యార్థులను అవుట్ గా ప్రకటించండి. 
• ఇలా రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా ఆటను ఆడించండి.
★★★★★★★★★★★★★
*కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.*
🎼  *పాట*
🎤 *పల్లవి :* 
నవ్య పథానికి దారి చూపుతూ 
గమ్య పథం గతిని తెలుపుతూ 
మనుషుల పాలిట మార్గ సూచీలు
దిక్కులు మనకు నాలుగు   //నవ్య పథానికి//

🎻 *చరణం 1:*
ఊరిలో వీధి తెలియాలన్నా 
ఆఫీస్ అడ్రస్ కావాలన్నా 
ఇంటికి మనము చేరాలన్నా
దిక్కుల గురించి తెలియాలి  //నవ్య పథానికి//
 
🎻 *చరణం 2:* 
ఊరికి హద్దులు తెలియాలన్నా 
ఇంటికి స్థలం కొనాలన్నా 
గ్రామ పటం గీయాలన్నా
దిక్కుల గురించి తెలియాలి  //నవ్య పథానికి//
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
★★★★🔚🙋‍♂★★★★




*🔸సమయం: 11 AM*


📻📻📻📻📻📻

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేటి రేడియో పాఠం"

Post a Comment