వృద్ధి రేటుపై వరల్డ్ బ్యాంక్ వార్నింగ్
న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంక్ 7.5శాతం నుంచి 6శాతానికి తగ్గించింది. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొనుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ క్రమక్రమంగా పుంజుకొని వృద్ధి రేటు 6.9శాతానికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.5శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ గతంలో అంచనా వేసిన విషయం విదితమే. కానీ, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కారణంగా వృద్ధి రేటును బ్యాంక్ తగ్గించిందని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి కూడా ఆశాజనకంగా లేదని తెలిపింది.
0 Response to "వృద్ధి రేటుపై వరల్డ్ బ్యాంక్ వార్నింగ్"
Post a Comment