ఉపాధ్యాయులకు వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం గురించి
*డా వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమం......🔴*
*♦ ఉపాధ్యాయులకు వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం గురించి♦
*📌ఉపాధ్యయులకు సూచనలు*
✒ప్రతి పాటశాల కు ఒక ఉపాధ్యాయులు ఈ కార్యక్రమ నిర్వహణ కు బాధ్యులుగా వుండాలి.
✒ఆశా కార్యకర్త సంబంధిత ఉపాధ్యాయుని సమక్షం లో విద్యార్థులకు కంటి తనిఖీ లను నిర్వహిస్తారు....
✒దీనికి సంబంధించి ఒక విజన్ చార్ట్,ఒక టార్చ్ లైట్,ఒక టేపు,సరఫరా చేయడం అయినది.
*వీటి వినియోగం ఇలా.........🔴*
✒మంచి వెలుతురు వున్న ప్రదేశం లో కంటి తనిఖీ లు జరగాలి.
✒విద్యార్థి నిలుచున్న దగ్గర నుంచి మూడు మీటర్ల దూరం ను టేపు సహాయం తో కొలిచి విద్యార్థి తలకు సమాంతరంగా విజన్ చార్ట్ ను గోడకు పేస్ట్ చేయాలి.
✒విద్యార్థి నిలుచునే ప్రదేశాన్ని శుద్ధ ముక్క తో మార్క్ చేసి విద్యార్థిని అక్కడ నిలబెట్టాలి.
✒విద్యార్థులు కంటి పరీక్షలు జరుగుతున్న ప్రదేశం లో ఎక్కువ మంది లేకుండా చూడాలి.
✒ఇది వరకే కంటి అద్దాలు వాడుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు తోనే తనిఖీ నిర్వహించాలి.
*📌ప్రదర్శన........🔴*
✒ పరీక్షా ప్రక్రియ చేపట్టే ముందు *E* అక్షరం యొక్క కొసలు ఏ వైపు కు వున్నయిననే విషయం చేతితో ఊపి ఏ విధంగా చెప్పాలో సూచించండి.
✒పరీక్షా చేయించుకునే విద్యార్థి పరీక్షలో ఎలా చెప్పాలో,చూపించాలి, అనే విషయం అర్ధం అయ్యింది అని నిర్ధారించుకున్న తరువాత ప్రక్రియ మొదలు పెట్టండి.
*పరీక్షించే విధానం..........🔴*
📌మొదటి లైన్ పెద్ద *"E"*
*📌పాస్.....🔴*
🕳 కనీసం రెండు అక్షరాలు చెప్పగలిగితే లేదా చుపించంగలిగితే తరువాత స్టెప్ కు వెళ్ళాలి
*📌 ఫెయిల్.......🔴*
🕳ఒక్క అక్షరం లేదా ఏ అక్షరం సరిగ్గా చెప్పడం లేదా చుపించనప్పుడు కంటి పరీక్షలు సూచించాలి.
📌రెండవ లైన్.. చిన్న *E*
*📌పాస్.......🔴*
🕳కనీసం 4 అక్షరాలు చెప్పగలిగే లేదా చూపించ గలగాలి.
*📌 ఫెయిల్.........🔴*
🕳మూడు లేదా అంతకు తక్కువ అక్షరాలు చెప్పడం లేదా చూపించక పోతే కంటి పరీక్ష సూచించాలి..
*🔴ముందు కుడి కన్ను తరువాత యెడమ కన్ను ను ఇదే విధంగా పరీక్షించాలి....*
*♦♦గమనిక.......*
✒విద్యార్థికి కంటి పరీక్ష చేసేటప్పుడు తన రెండవ కంటిని మృదువుగా ముసుకోమని చెప్పాలి.
*♦♦సంపూర్ణ కంటి పరీక్షా*
✒కళ్ళు రెండింటి లో ఏ ఒక్క దానిలో నైనా దృష్టి పరీక్షలో ఫెయిల్ అయినట్లాయిన
✒టార్చ్ లైట్ పరీక్షలో ఏదైనా అసాధారణ పరిస్తితి గమనించినా
✒ఇతర కంటి సంబంధిత సమస్యలు వున్నవారు.
*♦వీరిని పూర్తి కంటి పరీక్షకు పంపించాలి....*
*♦♦గమనించండి..♦♦*
✒ఈ కార్యక్రమం పూర్తి అయ్యే లోగా దృష్టి లోపం వున్న వారు,లేనివారు ఈ ప్రాథమిక దశ లో నిర్ధారణ జరగాలి.
*నమస్కారములతో.........🙏*
0 Response to "ఉపాధ్యాయులకు వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం గురించి"
Post a Comment