మనసున్న మారాజు అజీమ్ ప్రేమ్‌జీ
- ఆయన ప్రస్తుత సంపద విలువ రూ.1.17 లక్షల కోట్లు
- ఇప్పటిదాకా విరాళమిచ్చింది.. రూ.1.48 లక్షల కోట్లు
- దాతృత్వంలో ‘విప్రో’ అజీమ్ ప్రేమ్‌జీ గొప్పదనం
ముకేశ్ అంబానీ, హిందూజా కుటుంబం. కానీ, దాతృత్వంలో మాత్రం ప్రేమ్‌జీదే అగ్రస్థానం. ‘దాతృత్వ ప్రతిన (గివింగ్ ప్లెడ్జ్)’ పేరుతో వారెన్‌బఫెట్, బిల్‌గేట్స్ వంటి శ్రీమంతులు ఇచ్చిన పిలుపును అందుకున్న తొలి భారతీయుడు.. అజీమ్ ప్రేమ్‌జీ. ‘సంపన్నుడిగా ఉండడం నాకేం థ్రిల్ కలిగించదు’ అంటూ 2013లో ఆయన తన సంపదలో సగభాగాన్ని దాతృత్వానికి ఇచ్చేశారు. ‘బెయిన్ అండ్ కంపెనీస్ భారత దాతృత్వ నివేదిక 2019’ ప్రకారం గత ఐదేళ్లలో (2014-2018) భారతీయ కుబేరులు తమ సంపదలో దాతృత్వానికి ఇచ్చిన మొత్తం రూ.43వేల కోట్లు. అందులో 80 శాతం సొమ్ము అజీమ్ ప్రేమ్‌జీ ఇచ్చిందే!! ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ కింద గత ఐదేళ్లలో ఆయన నిబంధనల ప్రకారం ఇవ్వాల్సినదానికన్నా మూడు రెట్లు అధికంగా ఇచ్చారు. ఇక ఈ ఏడాది ఆయన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విప్రో షేర్లలో 34ు ఇచ్చేశారు. గతంలో కూడా ఇచ్చిన షేర్లతో కలుపుకొంటే ప్రేమ్‌జీ షేర్లలో 67ు మేర దాతృత్వానికి ఇచ్చినట్టయింది. ప్రేమ్‌జీ అసాధారణ దాతృత్వానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సైతం ముగ్ధులై ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ప్రేమ్‌జీ సేవా కార్యక్రమాలు 2000 సంవత్సరం నుంచే కొనసాగుతున్నాయి. ఆయన స్థాపించిన ‘అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్’ గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యావ్యవస్థ మెరుగుదలకు కృషి చేస్తోంది

0 Response to "మనసున్న మారాజు అజీమ్ ప్రేమ్‌జీ"
Post a Comment