ఆ ఆరు మార్పులు నేటి నుంచి అమలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌ : అక్టోబర్‌ 1వ తేదీ నుంచి బ్యాంకింగ్‌, పింఛన్‌, పోస్టాఫీస్‌ వంటి కీలక రంగాల్లో కొన్ని సరికొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. వీటిల్లో కొన్ని రుణాలకు సంబంధించి కాగా.. మరికొన్ని క్రెడిట్‌కార్డులకు సంబంధించనవి ఉన్నాయి. ఆ మార్పుల వివరాలు సంక్షిప్తంగా మీకోసం..



ఇంధన కొనుగోళ్లపై క్రెడిట్‌ కార్డు రాయితీలు బంద్‌.. 
పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లపై కొన్ని క్రెడిట్‌కార్డులు ఇస్తున్న రాయితీలకు నేటితో ముగింపు పలికారు. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సంస్థలు వినియోగదారులకు తెలియజేశాయి. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ పంపి తెలియజేసింది


ఇప్పటికే అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కార్డులపై డిస్కౌంట్‌ను నిలిపివేసింది. గతంలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ రూ.45 వరకు డిస్కౌంట్‌ ఇచ్చేది.

పోస్టాఫీసుల్లో వడ్డీరేట్లలో మార్పు లేదు..

ప్రభుత్వం పోస్టాఫీసుల్లో చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో వడ్డీరేట్లను మార్చింది. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, కేవీపి మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. వీటిపై వడ్డీరేట్లను ఆర్థిక సంవత్సరంలో మూడునెలలకోసారి సమీక్షిస్తారు. అక్టోబర్‌తో మొదలయ్యే త్రైమాసికానికి వడ్డీరేట్లలో మార్పులు చేయలేదు. చివరి సారిగా జూన్‌ త్రైమాసికం ప్రారంభంలో వడ్డీరేట్లను మార్చారు.

పింఛనుదారులకు లైఫ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి..

పింఛనుదారులకు బ్యాంకుల్లో లైఫ్‌ సర్టిఫికెట్‌ తప్పని సరి చేశారు. నవంబర్‌ నాటికి ఈ ధ్రువీకరణను సమర్పించాల్సి ఉంది. 80 సంవత్సరాలు దాటిన వారికి ప్రభుత్వం కొంత వెసులుబాటును కల్పించింది. వారు వచ్చే ఏడాది నవంబర్‌లోపు ఎప్పుడైనా దీనిని బ్యాంకులో సమర్పించాలి. 

ఎస్‌బీఐ ఖాతాపై కొత్త ఛార్జి

ఎస్‌బీఐ ఖతాదారులపై కొత్త ఛార్జి పడనుంది. ఇప్పటి వరకు నగదు లావాదేవీలకు సంబంధించి మాత్రమే ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ, అక్టోబర్‌ 1 నుంచి ఖాతాలో కనీస నిల్వ లేకపోయినా బ్యాంక్‌ ఛార్జిలు విధిస్తుంది.

ఇక వడ్డీరేట్లు అప్పటికప్పుడు మారతాయి..

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి గృహరుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలను బెంచ్‌మార్క్‌ రేట్లతో అనుసంధానించనున్నారు. ఇందు కోసం ఆర్‌బీఐ బ్యాంకులకు నాలుగు రకాల బెంచ్‌మార్కులను సూచించింది. వీటిల్లో ఇష్టం వచ్చినదాన్ని బ్యాంకులు ఎంపిక చేసుకోవాలి. దీంతో చాలా బ్యాంకులు రెపోరేటు వైపే మొగ్గు చూపాయి. దీంతో రెపో అనుసంధానిత రుణ వడ్డీరేట్లు(ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)వర్తించనున్నాయి. ఇవి ప్రతిబ్యాంకుకు ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని బ్యాంకులకు 5.5శాతం, కొన్ని చోట్ల 6.5శాతం ఉంటాయి. ఎంసీఎల్‌ఆర్‌తో పోలిస్తే ఇది చాల వేగంగా ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆ ఆరు మార్పులు నేటి నుంచి అమలు..!"

Post a Comment