జియో ఫోన్ కస్టమర్లకు మరో ఆఫర్ - రూ.75తో మంత్లీ ప్లాన్

తమ కస్టమర్లకు రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఆల్ వన్ ప్లాన్‍ను అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్ జియో... తాజాగా ఇండియా కా స్మార్ట్ ఫోన్ కస్టమర్ల కోసం మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది ఓ మంత్లీ ప్లాన్ కావడం గమనార్హం.



ఈ ప్లాన్లలో భాగంగా, రూ.75, రూ.125, రూ.185 విలువైన రీచార్జ్‌ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లలో వరుసగా నెలకు 3జీబీ (రోజుకు 0.1 జీబీ), 14జీబీ,(రోజుకు 0.5 జీబీ), 28 జీబీ (రోజుకు 1 జీబీ), 56 జీబీ (రోజుకు 2జీబీ) డేటాలను అందిస్తుంది

అంతేకాదు ఉచిత 500 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్‌ చేస్తోంది.

అలాగే అపరిమిత జియో - టు - జియో, ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్‌లు కూడా ఉన్నాయి.

ఇటీవల ఇంటర్‌ కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి)
చార్జీలను జియో ప్రకటించింది. దీనిపై
వినియోగదారులనుంచి
నిరసన వ్యక్తం కావడంతో
స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల‍కోసం ఆల్‌ ఇన్‌ వన్‌ మంత్లీ ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే


SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "జియో ఫోన్ కస్టమర్లకు మరో ఆఫర్ - రూ.75తో మంత్లీ ప్లాన్"

Post a Comment