వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఏపీ సర్కార్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పై కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్,చెన్నై,బెంగళూరు నగరాల్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబర్ 1 నుంచి హైదరాబాద్,చెన్నై,బెంగళూరు నగరాల్లో ఈ సేవలు పొందొచ్చు. 716 రకాల వైద్య సేవలను ఈ నగరాల ఆస్పత్రుల్లో పొందేందుకు వీలుగా
ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మరో వైపు డిసెంబర్ 21నుంచి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు స్మార్ట్ హెల్త్ కార్డులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటి వరకు తెల్లరేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు నంబర్ పొందితే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు
రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
0 Response to "వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం"
Post a Comment