ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జాబ్ నోటిఫికేషన్... అక్టోబర్ 31 లాస్ట్ డేట్
తగిన అర్హతలు ఉండి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్- APSLPRB ఉద్యోగాల భర్తీ చేపట్టింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 50 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మొత్తం 400 మార్కుల్లో (పేపర్ 1-200 మార్కులు, పేపర్ 2-200 మార్కులు) అభ్యర్థులకు వచ్చిన మార్కుల్ని బట్టి 1:2 రేషియోలో ఇంటర్వ్యూకు పిలుస్తారు
నోటిఫికేషన్ను APSLPRB అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
0 Response to "ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జాబ్ నోటిఫికేషన్... అక్టోబర్ 31 లాస్ట్ డేట్"
Post a Comment