Vinayak chavithi Puja book
*వినాయకచవితి శుభాకాంక్షలు!*
*వినాయకునికి పద్యాల నైవేద్యం*
వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!
CLICK HERE TO DOWNLOAD VRATAM BOOK
వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!
నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!
వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?
నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!
వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...
నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?
వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.
నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...
వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!
నేను: అవునా స్వామీ! అదేం?
వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.
నేను: శుక్లాంబరధరం విష్ణుం...
వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?
నేను: తోండము నేకదంతమును...
వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.
నేను:
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!
వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!
నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!
వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!
నేను: అలాగా!
వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... *అల్లసాని పెద్దన.* అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.
నేను:
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!
వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.
నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే *కేతన కవి* ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!
వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.
నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!
వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!
నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.
వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?
నేను: *నన్నెచోడుడు* అనుకుంటాను స్వామీ!
వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.
నేను: చిత్తం.
తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!
వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.
నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ *భట్టుమూర్తి.* ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!
వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.
నేను:
దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!
వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!
నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!
నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!
వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?
నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.
వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!
నేను: *పోతన* తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!
వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి *మొల్ల* పద్యమో?
నేను: చిత్తం సిద్ధం!
చంద్రఖండ కలాపు జారు వామనరూపు
గలిత చంచలకర్ణు గమల వర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు
భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు
లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు
విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు
బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!
వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ *శ్రీనాథ* కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?
నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!
కలితశుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజలధరములు
వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్నమేఖలములు
పక్వ జంబూఫల ప్రకటసంభావనా
చుంబిత భూభృత్కదంబకములు
వికట కండూల గండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు
శాంభవీశంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి గావించు గాత!
వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!
అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?
నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, *కరుణశ్రీ* అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.
వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.
నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.
ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరుగెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా!" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట
అమరులందగ్ర తాంబూలమందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!
వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!
మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!
కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.
నేను: లోటా! ఏవిటి స్వామీ?
వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?
నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.
వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.
నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!
శ్రీకంఠుని సతి ప్రేమకి
ఆకారమ్మైన సామి! హరుని దయన్ నూ
త్నాకృతి దాల్చిన గజముఖ!
చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!
నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి.
[01/09, 2:32 pm] S R RAO: శ్రీరస్తు-
(ముందుగా బొట్టు పెట్టుకొని, దీపారాధన చేసి, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్థించాలి)
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే॥
అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు
తదేవ లగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ,
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి॥
శ్లో॥ లాభస్తేషాం జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః॥
ఏషామిన్దీవర శ్యామో హృదయస్థో జనార్థ న ః॥
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్
(అని నమస్కరించుకుని ఆచమనం చేయాలి)
ఆచమ్య.. ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా,
ఓం మాధవాయ స్వాహా
(మూడు సార్లు కుడిచేతిలోకి కొంచెం నీరు పోసుకొని చప్పుడు చేయకుండా తాగాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీ్ధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్థనాయ నమః, ఉపేన్ద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః.
(కుడి చేతిలో నీరు తీసుకొని కుడి చేతిమీదుగా ఎడమ వైపునకు చల్లాలి.)
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః,
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే,
ఓం భూః ఓం భువః ఓం జనః ఓం తపః, ఓగ్‌ంసత్యం, ఓం తత్సవి తుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓమా పోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.
ఓగ్‌ం సువః, ఓం మహః మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్యబ్రహ్మణః, ద్వితీయ పరార్ధే శే్వత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య..... ప్రదేశే కృష్ణా గోదావర్యౌః మధ్య దేశే.. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన వికారి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే చతుర్ధ్యాం తిథౌ, వాసరే, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్... గోత్ర... నామధేయః ధర్మపత్నీ సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య, శ్రీ సిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం, కల్పోక్త ప్రకారేణ యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. (నీళ్లను చేతితో తాకాలి)
తదంగకలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య.
(కలశమును నీళ్లతో ఉంచి అందులో పుష్పాలు, అక్షతలు, గంధమును వేసి కుడిచేతి ఉంగరపు వేలు అందులో మునిగేట్లుగా అరచేతితో మూయాలి)
కలశస్య ముఖేవిష్ణుః కంఠేరుద్రః స మాశ్రీతః,
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః,
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యుజుర్వేద స్పామవేదో హ్యథర్వణః,
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రీతాః,
ఓం... గంగేచైవ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య
(కలశంలోని జలాన్ని దేవునిపైనా, పూజాద్రవ్యాలపై చల్లాలి. తరువాత తమ మీద కొద్దిగా చల్లుకోవాలి. అనంతరం గణపతిని పూజించాలి.)
ఓం గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే
కవింక వీనా, ముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనశ్శృణ్వన్నూతిభిస్సీద సాధనమ్
శ్రీ మహా గణాధిపతయే నమః
ఏకదంతం శూర్ప కర్ణం గజవక్త్రం చతుర్భుజం,
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం,
భక్త్భాష్టప్రదం తస్మాత్ ధ్యాయే త్తం విఘ్న నాయకమ్!
(వినాయక ప్రతిమకు నమస్కరించాలి. పూజాక్షతలు తలపై వేసుకోవాలి).
ఆవాహయామి: శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః, ఆసనం సమర్పయామి, తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ :
వౌక్తికైః పుష్యరాగైశ్చ
నానా రత్నైర్విరాజితం,
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం
ప్రతి గృహ్యతాం (అక్షతలు వేయాలి)
అర్ఘ్యం: గౌరీ పుత్ర నమస్తేస్తు
శంకర ప్రియనందన,
గృహాణార్ఘ్యం మయాదత్తం
గంధ పుష్పాక్షతైర్యుతం!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.(ఉద్ధరిణితో పళ్లెములో నీళ్లు వదలాలి)
పాద్యం: గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణద్విరదానన!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి. (ఉద్ధరిణితో పళ్లెములో నీళ్లు వదలాలి)
ఆచమనీయం: అనాథ నాథ సర్వజ్ఞ, గీర్వాణ పరిపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. (ఉద్ధరిణితో పళ్లెములో నీళ్లు వదలాలి)
మధుపర్కం: దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక! అనాథ నాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి. (పాలు, తేనె, పంచదార, పెరుగు, నెయ్యి కలిపిన పంచామృతాన్ని సమర్పించాలి.)
స్నానం: గంగాది సర్వతీర్థ్భే్య అహ్నతైరమలైర్జలైః
స్నానం కరిష్యే భగవన్వుమా పుత్ర నమోస్తుతే!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి.
(ప్రతిమపై నీళ్లు చల్లాలి.)
వస్త్రం: రక్తవస్తద్వ్రయం చారు దేవయోగ్యం చ మంగళం
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః వస్తయ్రుగ్మం సమర్పయామి
(వస్తమ్రులు కానీ, లేదా పసుపుతో తడిపిన పత్తిని కానీ సమర్పించాలి)
యజ్ఞోపవీతం: రాజితం బ్రహ్మసూత్రం కాంచనం చోత్తరీయకం
గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానా మిష్టదాయక!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. (వినాయకునికి నమస్కరించి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
గంధం: చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతామ్!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి.
(స్వామిపై గంధం చల్లాలి)
అక్షతాభరణం: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమస్తుతే!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి. (అక్షతలు చల్లాలి)
పుష్పం: సుగంధాని సుపుష్పాణి జాజీ కుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే! శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పుష్పాణి పూజయామి. (జాజి, మల్లె వంటి 21 రకాల సుగంధ పుష్పాలతో పూజించాలి.)
అథాంగ పూజ:
(పాదముల నుంచి శిరస్సు వరకు సర్వాంగాలకు పూజ చేయవలెను.)
ఓం గణేశాయనమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజాయామి, శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి; విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి; ఆఖువాహనాయ నమః ఊరూం పూజయామి; హేరంబాయ నమః కటిం పూజయామి; లంబోదరాయ నమః ఉదరం పూజయామి; గణానాథాయనమః నాభిం పూజయామి; గణేశాయ నమః హృదయం పూజయామి; స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి; స్కంధాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి; పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి; గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి; విఘ్న హంత్రే నమః నేత్రే పూజయామి; శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి; ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి; సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి; విఘ్న రాజాయనమః సర్వాణ్యంగాణి పూజయామి.
ఏకవింశతి పత్రపూజ
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః అథైక వింశతి పత్ర పూజాంచ కరిష్యే (21 రకాల ఆకులతో పూజించాలి.)
సుముఖాయనమః మాచీపత్రం పూజయామి (మాచీపత్రం)
గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి(వాకుడు)
ఉమాపుత్రాయనమః బిల్వపత్రం పూజయామి(మారేడు)
గజాననాయనమః దుర్వాయుగ్మం పూజయామి(గరిక)
హరసూనవేనమః దత్తూర పత్రం పూజయామి(ఉన్మత్త)
లంబోదరాయనమః బదరీపత్రం పూజయామి(రేగు)
గుహాగ్రజాయనమః అపా మార్గపత్రం పూజయామి(ఉత్తరేణి)
గజకర్ణాయనమః తులసీపత్రం పూజయామి(తులసి)
ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి(మామిడి)
వికటాయ నమః కరవీర పత్రం పూజయామి
భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి(విష్ణుక్రాంత)
వటవే నమః దాడిమీ పత్రం పూజయామి(దానిమ్మ)
సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి(దేవదారు)
ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి(మరువం)
హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః జాజీపత్రం పూజయామి(జాజి)
సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి(ఏనుగు చెవి)
ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి(జమ్మి)
వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి(రావి)
సుర సేవితాయ నమః అర్జున పత్రం పూజయామి(మద్ది)
కపిలాయ నమః అర్కపత్రం పూజయామి(జిల్లేడు)
శ్రీగణేశ్వరాయనమః ఏకవింశతి పత్రాణి పూజయామి.
(మిగిలిన పుష్పాలన్నీ వేసి నమస్కరించాలి)
దూర్వాయుగ్మ పూజ
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
సర్వసిద్ధి ప్రణాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి
ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి
ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి
శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ
ప్రతి నామమునకు మొదట ‘ఓం’ అని, చివర ‘నమః’ అని చదువుతూ పుష్పములతో, పత్రితో పూజ చేయాలి.
ఓం గజాననాయ నమః, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ, వినాయకాయ, ద్వైమాతురాయ, ప్రజ్ఞనిధయే, ద్విముఖాయ, ప్రముఖాయ, సుముఖాయ, కృతినే, సుప్రదీపాయ, భవాత్మజాయ, శృంగారిణే, ఆశ్రీతవత్సలాయ, శ్రీఘ్రకారిణే, శాశ్వతాయ, బ్రహ్మచారిణే, సురాధ్యక్షాయ, విశ్వదృశే, విశ్వరక్షాకృతే, మహా బలాయ, పూష్ణే, హేరంబాయ, లంబజఠరాయ, హ్రస్వగ్రీవాయ, మహావీరాయ, దన్తినే, మంగళస్వరాయ, ప్రమదాయ, విఘ్నకర్త్రే, విఘ్నహన్రే్త, విశ్వనేత్రే, విరాట్పతయే, అవ్యక్తాయ, కుంజరాసుర భంజనాయ, ప్రమోదాత్తాననాయ, మోదకప్రియాయ, శాంతిమతే, ధృతిమతే, కృతిమతే, కామినే, కపిత్థ్ఫలప్రియాయ, అప్రాకృతపరాక్రమాయ, సత్య దర్శినే, సంసారామ్బునిధయే, అగ్రగణ్యాయ, అగ్రగామినే, అగ్రపూజ్యాయ, మంత్రకృతే, చామీకరప్రదాయ, సర్వయన్రే్త, సర్వోపన్యాసాయ, సర్వవిద్యప్రదాయ, సర్వనేత్రే, సర్వసిద్ధి ప్రదాయకాయ, సర్వసిద్ధయే, పంచహస్తాయ, మహోదరాయ, మదోత్కటాయ, కుమారగురవే, అక్షోభ్యాయ, శ్రీపతయే, పార్వతీనందనాయ, ప్రభవే, పతయే, మహేశాయ, మణికింకిణీ మేఖలాయ, దివ్యాంగాయ, సమస్తదేవతామూర్తయే, సహిష్ణవే, సతతోత్థితాయ, విభూతికారిణే, జిష్ణవే, విష్ణవే, బ్రహ్మరూపిణే, విష్ణుప్రియాయ, భక్తజీవితాయ, జితమన్మథాయ, ఐశ్వర్యకారణాయ, జ్ఞాననిధయే, యక్షకిన్నర సేవితాయ, గౌరీసుతాయ, బలాయ, బలోత్థితాయ, గణాధిపాయ, గంభీరనినదాయ, సఖ్యై, వటవే, అభీష్టవరదాయ, భక్తనిధయే, భావగమ్యాయ, మంగళప్రదాయ, కళ్యాణగురవే, ఉన్మత్తవేషాయ, పరజితే, శత్రుజితే, సమస్త జగదాధారాయ, సర్వైశ్వర్యప్రదాయ, పురాణపురుషాయ, అక్రాంతచిదచిత్ప్రభవే, శ్రీవిఘ్నేశ్వరాయ, భక్తపారిజాతాయ, విఘ్నేశాయ, శ్రీసిద్ధివినాయకాయ, శ్రీమహాగణాధిపతయే నమః
ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్త్భ్యుం గృహాణ వరదోభవ
శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.
(గణపతికి ధూపము వేయాలి)
దీపం: సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాజ్యోతితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామిదేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాద్దివ్య జ్యోతిర్నమోస్తుతే!
శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః దీపం దర్శయామి. (దీపం చూపించాలి.) (
నైవేద్యం: సుగంధాన్ సుకృతాం శ్చైవమోదకాన్ ఘృత పాచితాన్
నైవేద్యం గృహ్యతాం దేవచ గణముద్గైః ప్రకల్పితాన్
భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయ మేవచ
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక
శ్రీ సిద్ధి వినాయక స్వామినేనమః, నైవేద్యం సమర్పయామి.
(నైవేద్యం సమర్పించాలి.
ఓం ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, (నైవేద్యాన్ని స్వామికి చేయి చూపుతూ సమర్పించాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి,
ఉత్తరాపోశనం సమర్పయామి,
హస్తౌ ప్రక్షాళయామి,
పాదౌ ప్రక్షాళయామి,
శుద్ధం ఆచమనీయం సమర్పయామి
(తాగుటకు, చేతులు కడుగుకొనుటకు నీళ్లు ఉద్ధరిణితో సమర్పించి, పళ్లెములో వదలాలి)
తాంబూలం: పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః, తాంబూలం సమర్పయామి.
( తాంబూలం ప్రతిమ దగ్గర ఉంచాలి.)
నీరాజనం: సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే
లక్ష్మీరాష్టస్య్ర యాముఖేతయా మాసంగ్‌ం సృజామహి
హిరణ్యపాత్రం మథోః పూర్ణందధాతి
మథవ్యో సానీతీ ఏకథా బ్రహ్మణ ఉపహరతి
ఏకథైవ యాజమాన ఆయుస్తేజో దధాతి
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి (హారతి ఇవ్వాలి)
మంత్రపుష్పం:
గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన
వినాయకేశతనయ సర్వ సిద్ధిప్రదాయక
ఏకదంతైక వదన తథా మూషికవాహన
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిమ్.
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః
సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి.
అర్ఘ్యం: గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక
గంధ పుష్పాక్షతై ర్యు
0 Response to "Vinayak chavithi Puja book"
Post a Comment