వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
దిల్లీ: గృహ అవసరాల కోసం వినియోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ రేట్లు తగ్గి నెల రోజులు దాటక ముందే మళ్లీ వాటి ధర పెరిగింది. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ.15.5 పెంచినట్లు
ప్రభుత్వరంగ ఇంధన రీటైల్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.574.5 ఉండగా, పెరిగిన ధరతో రూ.590 కి చేరుకుంది. ఈ మార్పులు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ఇంధన సంస్థలు తెలిపాయి. ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పీజీ ధరలను రీటైల్ సంస్థలు సవరిస్తున్నందున ఈ కొత్త రేట్లు ఇవాల్టి నుంచి అమలులో
వచ్చాయి. డాలర్‌పై రూపాయి మారకం విలువ తగ్గడం వల్ల ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం.. ధరల పెరుగుదలకు కారణమైందని ఇంధన సంస్థలు తెలిపాయి
ఈ నేపథ్యంలో ఎల్‌పీజీతో పాటు ఇంధన సంస్థలు విమాన ఇంధన ధరలను సైతం సవరించాయి.
అంతర్జాతీయ చమురు ధరలు నిలకడగా ఉండడంతో జెట్ ఇంధన ధరను 1 శాతం తగ్గించినట్లు ఇంధన సంస్థలు తెలిపాయి. దీంతో విమాన ఇంధన ధర నాలుగు నెలల కనిష్ఠానికి తగ్గినట్లయింది. ప్రస్తుతం దిల్లీలో ఒక కిలో విమాన ఇంధన ధర దిల్లీలో రూ.596.62 (0.9 శాతం) తగ్గి రూ.62,698గా ఉంది
0 Response to "వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపు"
Post a Comment