‘రికార్డు స్థాయిలో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు

సాక్షి, అమరావతి: విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు నిర్వహించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకేరోజు రికార్డు స్థాయిలో 96 శాతం పాఠశాలల్లో ఎన్నికలు జరిపామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,612 పాఠశాలల్లో ఎన్నికలు 



నిర్వహించామన్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు జరిపామని మంత్రి చెప్పారు. 63 శాతం పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "‘రికార్డు స్థాయిలో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు"

Post a Comment