విద్యాప్రదాత ఆ ఉపాధ్యాయుడు..

ప్రజాశక్తి - అట్లూరు 
ఆయన గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో మక్కువ. ఆ ఇష్టమే ఆయన్ని టీచర్‌ని చేసింది. అందరిలా గాక కాస్త భిన్నంగా ఆలోచించి పేద విద్యార్థుల చదువుకు పాటుపడుతున్నారు. పాఠశాలలకు ప్రహరీ, సౌకర్యాల కల్ప వంటి వాటిని చేస్తున్నారు. సేవలను గుర్తించి ప్రభుత్వం ఎన్నో ఉత్తమ అవార్డులు అందజేసి సత్కరించింది. ఆయనే మండలానికి చెందిన విజయమోహన్‌రెడ్డి. ఆయన విద్యా సేవల గురించి ..
ప్రజాశక్తి - అట్లూరు 
కొండూరు మండలం పాలూరుకు చెందిన విజయమోహన్‌రెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకటరెడ్డి, తల్లి ఈశ్వరమ్మ. ఆయనకు ఉపాధ్యాయ వృత్తి అంటే మక్కువ.




పాలూరులోనే తన విద్యాభ్యాసం ప్రారంభించారు. అగడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన ఆయన ప్రొద్దుటూరు ఎస్‌సిఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. 1997 జులై అట్లూరు మండలంలోని మారుమూల ప్రాంతమైన మద్దూరులో ఉపాధ్యాయునిగా ఉద్యోగ ప్రస్తానం మొదలెట్టారు. అప్పట్లో మండల కేంద్రమైన అట్లూరు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న మద్దూరుకు పని చేశారు. నిత్యం ఉదయం నడిచి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవారు. గ్రామంలో పేదరికంతో అల్లాడుతూ చదువుకోలేని వారిని చూసి చలించిపోయారు. అలాంటి వారి కోసం విద్య చెప్పాలనే తపన ఏర్పడింది. 
ఈక్రమంలో 2000 సంవత్సరంలో మైలవరానికి బదిలీ అయ్యారు. దేశం మొత్తం మీద ఐదువేల సైన్సుక్లబ్‌లున్నాయి. 27 సైన్స్‌సైన్స్‌క్లబ్‌ల్లో ఆయన పనిచేసే పాఠశాల గోల్డ్‌క్లబ్‌ ఎంపికైంది. ఇందులో ఆయన కృషి ఎంతో ఉంది. విద్యాచ్థులకే మంచి ప్రతిభ కబరిచేలా చేసినందుకు జార్ఖండ్‌ సైన్స్‌క్లబ్‌వారు ఆయనకు ఉత్తమ అవార్డు ప్రదానం చేశారు. 2003లో మైలవరంలో ఆయన పనిచేసే పాఠశాలలో 5వ తరగతి చదివిన విద్యార్థులు పై తరగతులు చదివేందుకు అవకాశం, ఆసక్తి కనబరచకపోవడంతో గుర్తించి విజయమోహన్‌రెడ్డి ఆ స్కూల్‌ను 7వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయించారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు ఆసక్తి కనబరిచారు. ఫలితంగా బడిమానిన పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఆయన చూపిన చొరవకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు. ఎక్కడ పనిచేసినా విద్యార్థులకు దాతల ద్వారా ఉచిత నోట్‌పుస్తకాలు, సైన్స్‌ సజ్జెక్టులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేయడం, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం, ఎన్‌ఎంఎంఎస్‌కు ప్రత్యేక శిక్షణ, రాష్ట్ర జాతీయ జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్షలకు శిక్షణ ఇవ్వడ వంటివి చేస్తున్నారు. 2014లో ఆయన పనిచేస్తున్న పాఠశాల రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు ఎంపికైంది. ఈ ఏడాది కెఎల్‌ యూనివర్సిటీ గుంటూరు వారిచే అవార్డు అందుకున్నారు. ఆయన మైలవవరం మండలం ఎం. కంబాలదిన్నెలో పనిచేస్తున్న పాఠశాలకు దాతల సాయంతో ప్రహరీని నిర్మించి ఇచ్చారు. అందరుకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. 
చాలా ఆనందంగా ఉంది..
ఉపాధ్యాయు వృత్తిలోకి వచ్చిన నాకు రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. ఉత్తమ బోధన అందించడం, విద్యార్థులను ప్రగతి బాటలోకి నడిపించడం, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు మెరుగులు దిద్దితే విజ్ఞాన వైతాళికలుగా నిలుస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొనేలా తీర్చి దిద్దాలనేది నా లక్ష్యం. 
- విజయమోహన్‌రెడ్డి, ఉపాధ్యాయులు.

ఫోటో: ఉపాధ్యాయుడు విజయమోహన్‌రెడ్డి 
ఫోటో: ముఖ్యమంత్రి చేతులు మీదుగా అవార్డు అందుకొంటున్న ఉపాధ్యాయుడు విజయమోహనరెడ్డి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యాప్రదాత ఆ ఉపాధ్యాయుడు.."

Post a Comment