ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్

పాఠశాలల్లో చేపట్టే 'స్వచ్ఛ పాఠశాల'కార్యక్రమాల్లో అంశాల ఆధారంగా ఈ పద్ధతి అమలు చేయాలని తీర్మానించింది. ఇప్పటికే దీనిపై పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ డీఈవోలు, ప్రధానోపాధ్యా యులకు మార్గదర్శకాలు జారీ చేశారు.

ఆరు ప్రధాన విభాగాల్లో మార్కులు...
'స్వచ్ఛ పాఠశాల'అమలులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, వంట సిబ్బంది, నీటి సదుపాయం, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, అడ్వొకసీ వంటి ఆరు ప్రధాన విభాగాల్లో మార్కులు కేటాయిస్తారు

వీటి ఆధారంగా పాఠశాలలకు రేటింగ్ ఇస్తారు. 1 నుంచి 5 స్టార్ రేటింగ్‌లు ఉంటాయి.

మార్కుల విధానం ఇలా..

  • వ్యక్తిగత పరిశుభ్రత(24 మార్కులకు).. పిల్లలు రోజూ స్నానం చేయడం, భోజనానికి ముందు, మరుగుదొడ్డి వినియోగించాక సబ్బుతో చేతులు కడుక్కోవడం, గోర్లు కత్తిరించుకోవడం తదితర అంశాలు.
  • వంట సిబ్బంది విభాగంలో(12).. గోర్లు కత్తిరించుకోవడం, వంట చేసేప్పుడు జుట్టు దగ్గరిగా ముడి వేసుకొని క్యాప్ ధరించడం, ఆహారం ముట్టుకునే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటివి.
  • నీరు విభాగంలో(8).. సురక్షిత నీటిని అందుబాటులో ఉంచడం, నీటి ట్యాంకును శుభ్రం చేయడం, తాగునీటికి వినియోగించే పాత్రలపై మూతలు పెట్టడం వంటివి.
  • మరుగుదొడ్ల విభాగంలో(12).. నీటిని అందుబాటులో ఉంచడం, శుభ్రమయ్యే వర కు నీరు పోయడం, బాలికల టాయిలెట్‌లో మూత కలిగిన చెత్త బుట్ట అందుబాటులో ఉంచడం తదితర వాటిని పరిగణిస్తారు.
  • పరిసరాల పరిశుభ్రతలో(19).. వ్యర్థ జలాన్ని మొక్కలకు మళ్లించడం, దాతల సహకారంతో పాఠశాల గదులకు సున్నం వేయించడం, తరగతి గదుల్లో చెత్త బుట్టలు అందుబాటులో ఉంచడం వంటి అంశాల ఆధారంగా మార్కులను ఇస్తారు. ఆ మార్కులను బట్టి రేటింగ్ ఇస్తారు.
  • అడ్వొకసీ విభాగంలో(25).. స్వచ్ఛతపై అవగాహన-అమలు, విద్యార్థుల్లో అవగాహన, విద్యార్థులు ఇతరులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టడం, స్వచ్ఛత క్లబ్‌ల ఏర్పాటు-అమలు, స్కూల్లో 90 శాతానికి మించి నెల వారీ హాజరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

మొత్తం 100 మార్కులకు గాను 90-100 మధ్య వస్తే 5 స్టార్, 75-89కు 4, 51-74కు 3, 35-50కి 2, 35 కంటే తక్కువ మార్కులొస్తే 1 స్టార్ ఇస్తారు. 

స్వచ్ఛత క్లబ్‌ల ఏర్పాటు..
వీటి అమలు కోసం ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా, పీఈటీ/లేకపోతే మరొక టీచర్ మెంబర్ కన్వీనర్‌గా, విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛత క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. వీటి ఆధ్వర్యంలో సబ్ కమిటీలు నియమించి పర్యవేక్షించాలి. వీటన్నింటిని స్వీయ మూల్యాంకనం చేసుకొని ప్రతి పాఠశాలకు రేటింగ్ ఇచ్చుకోవాలి. నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ఆ వివరాలు పై అధికారులకు తెలియజేయాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్"

Post a Comment