విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా గురువులకు రేటింగ్‌

విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా

గురువులకు రేటింగ్‌

సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఉత్తర్వులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకులాల సొసై
టీలో విద్యార్థుల ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుల భవితవ్యం తేల
నుంది. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధించే ఫలితాల ఆధారంగా... ఉపా
ధ్యాయులను 1 శాతం ఫలితాలు, 5 శాతం లోపు ఫలితాలు అంటూ రెండు
విభాగాలుగా విభజిస్తారు. వీరి పనితీరు పరిశీలనకు రెండు కమిటీలు
ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలు ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి
రేటింగ్‌ ఇస్తాయి. ఆ రేటింగ్‌ ఆధారంగా ఉపాధ్యాయులు కొనసాగడమా
లేక పదవీ విరమణ చేసి వెళ్లిపోవడమా అనేది తేల్చనున్నట్లు సాంఘిక
సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి కల్నల్‌ రాములు సోమవారం
ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని

అందులో పేర్కొన్నారు.


జ 5 శాతం లోపు ఉపాధ్యాయులు జిల్లా సమన్వయాధికారి(డీసీవో), ఆయా అంశాల్లో నిపుణుడు, స్థానిక డైట్‌ కళాశాల నుంచి ఒకరు సభ్యు లుగా ఉండే కమిటీ ముందు సెమినార్‌ ఇవ్వాలి. ఈ కమిటీ వారికి రేటింగ్‌ ఇస్తుంది. సాధారణం, అంతకన్నా తక్కువ రేటింగ్‌ పొందిన ఉపాధ్యాయులకు ఆరు నెలలు గడువిస్తారు. తర్వాత వారు సొసైటీ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ముందు నెమినార్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కమిటీ ముందు కూడా ఇవే ఫలితాలు పునరావృతమైతే వారు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. జ 1 శాతం లోపు ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులు సొసైటీ కార్య దర్శి, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీ ఈఆర్‌టీ) సంచా లకులు లేదా డైట్‌ కళాశాల ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు విషయ నిపుణులతో ఏర్పాటు చేసే కమిటీ ముందు సెమినార్‌ ఇవ్వాల్సి ఉంటుంది. తక్కువ రేటింగ్‌ వచ్చిన ఉపాధ్యాయులకు సామర్థ్యం పెంపు కోసం ఏడాది సమయం ఇస్తారు. ఏడాది తర్వాతా కూడా సాధారణం, అంతకన్నా తక్కువ అని రేటింగ్‌ వస్తే వారు పదవీ విర మణ చేయాల్సి ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా గురువులకు రేటింగ్‌"

Post a Comment