ఈ యాప్‌తో ఫైన్ తప్పించుకోండి
ఇటీవల దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేశారు. హడావిడి ప్రయాణాలు చేయడంతో పాటు ట్రాఫిక్ చెకింగ్ సమయంలో వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలనూ చూపించి తీరాలి. లేకపోతే భారీ జరిమానాలు తప్పవు. పరుగులాంటి జీవితంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వాహనానికి చెందిన కొన్నిరకాల పత్రాలు మరచిపోతాం.
అయితే స్మార్ట్‌ఫోన్స్ కాలంలో ఎన్నో పనులు సులభతరమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహన పత్రాలన్నీ ఒకచోట పెట్టుకునేందుకు ఏవైనా యాప్స్ ఉంటే బాగుంటుంది కదా! వివిధ పత్రాలు దాచుకునేందుకు ఆన్‌లైన్‌లో కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. 'డిజిలాకర్, ఎంపరివాహన్' అనే యాప్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ డిజిటల్ లాకర్ సిస్టమ్‌గా పిలిచే 'డిజిలాకర్' యాప్‌లో వాహనాలకు సంబంధించిన పత్రాలను భద్రపరుచుకోవచ్చు.
ట్రాఫిక్ పోలీసు అడిగినప్పుడు నేరుగా ఈ యాప్ నుంచే సంబంధిత పత్రాలు చూపించొచ్చు. హార్డ్ కాపీలను చూపించలేనప్పుడు డీజీలాకర్ యాప్ ద్వారా పత్రాలను చూపించి, జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే దీనికోసం వాహనదారులు తప్పనిసరిగా డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తమ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు భద్రపరుచుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు చెకింగ్ చేసే సమయాల్లో వాహనదారులు
డిజిలాకర్ ద్వారా సాఫ్ట్ కాపీ పత్రాలను చూపించవచ్చునని ఇప్పటికే బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
అయితే 'హార్డ్ కాపీ తప్పనిసరిగా ఉండాలా? లేదా సాఫ్ట్ కాపీ ఉంటే సరిపోతుందా?' అంటూ చాలా మంది వాహనదారులు సోషల్ మీడియా వేదికగా తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 కింద రవాణా శాఖ అధికారులు జారీ చేసిన వాహన డాక్యుమెంట్లు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ సహా ఇతర డాక్యుమెంట్లు ఏమైనా సరే

'డిజిలాకర్', ఎంపరివాహన్' యాప్స్‌ల్లో చూపించేవి చెల్లుబాటవుతాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ జారీ చేసిన సలహాల ప్రకారం ఈ పత్రాలన్నీ చెల్లుబాటవుతాయని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నారు. ఇలాంటివి అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదా?! ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాగా, సెప్టెంబర్ రెండు నుంచి కర్ణాటకలో అమల్లోకి తెచ్చారు
0 Response to "ఈ యాప్‌తో ఫైన్ తప్పించుకోండి"
Post a Comment