పీఆర్‌సీ కోరిక కాదు.. ఉద్యోగుల హక్కు

టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌

మాట్లాడుతున్న వొెంకటేశ్‌




నాగర్‌కర్నూల్‌ పట్టణం, న్యూస్‌టుడే : పీఆర్సీ ఉద్యోగుల కోరిక కాదని, సహజంగా రావాల్సిన హక్కని టీఎన్‌జీవోస్‌ అవిభక్త మహబూబ్‌నగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌ స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని టీఎన్‌జీవోస్‌ భవనంలో మంగళవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వార్షిక ఇంక్రిమెంట్‌లాగే పీఆర్సీ కూడా అందజేయాలన్నారు. అప్పటి వరకు ఐఆర్‌ ఇచ్చి ఉద్యోగులను శాంతింపజేయాలని కోరారు


ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ గడువు దాటటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని.. అందరూ అసహనంతో ఉన్నారన్నారు. వీలైనంత త్వరగా కచ్చితంగా పీఆర్సీ ఇవ్వాలని కోరారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులకు మేలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. దసరాలోగా 65 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీఎన్‌జీవోస్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, ఉపాధ్యక్షులు రాఘవేందర్‌, సత్యనారాయణ, కార్యదర్శి రాములు, కోశాధికారి మహ్మద్‌ షర్పుద్దీన్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా కోశాధికారి శ్రీధర్‌గౌడ్‌, నాగర్‌కర్నూల్‌ తాలుకా అధ్యక్షుడు సంజీవ, కోశాధికారి రెడ్డిరాం పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పీఆర్‌సీ కోరిక కాదు.. ఉద్యోగుల హక్కు"

Post a Comment