కొత్త ఇసుక విధానంపై మార్గదర్శకాలు జారీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి అమలు చేయబోతున్న కొత్త ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇసుక విధానం అమలు, ధరల నిర్ధరణ తదితర అంశాలపై నాలుగు వేర్వేరు జీవోలు జారీ చేసింది. 1966 చట్టంలో సవరణలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై ఈ జీవోలు విడుదలయ్యాయి. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుకను రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు తరలించి అమ్మకాలు జరపనున్నారు.
టన్ను ఇసుక ధరను రూ.375గా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నగదు చెల్లింపులను కూడా ఆన్‌లైన్‌లోనే చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇసుక రవాణా ఛార్జీలను నిర్ణయించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 102 ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించింది. జీపీఎస్ లేకుండా ఇసుక తరలిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. ఏపీ దాటి ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడంపై నిషేధం విధించారు. రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ల వద్ద జలవనరుల శాఖకు, పట్టాభూముల్లో తహసీల్దార్లకు ఇసుక తవ్వకాల బాధ్యతలను అప్పగించారు
0 Response to "కొత్త ఇసుక విధానంపై మార్గదర్శకాలు జారీ"
Post a Comment