కాంట్రాక్టుల్లో 50 శాతం
- ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు కేటాయింపు
- నిబంధనలు జారీ చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
కాంట్రాక్టులు, కాంట్రాక్టుల సర్వీసులలో నామినేషన్ పద్ధతి కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనా రిటీలకు 50 శాతం కల్పించేందుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు బిసి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికాలవలవన్ సోమవారం నోటిఫికేషన్‌తో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు వర్కులు అప్పగించే సమయంలో వాటి రకాన్ని బట్టి జిల్లాను కానీ,
రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన సాల్వెన్స్ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ల నుంచి మూడు మాసాల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన నెలలోపు పనులకు సంబంధించిన వెబ్‌పోర్టల్‌ను రూపొందించ నున్నట్లు తెలిపారు. అన్ని కాంట్రాక్టుల్లో రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టుల పనులకు సంబంధించి నెల వారీ నివేదికలను అన్ని ఇంజనీరింగ్ విభాగాలు

రాష్ట్రాన్ని కానీ యూనిట్‌గా పరిగణించాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల కాంట్రాక్టు పనులకు సంబంధిత పరిపాలన శాఖ ద్వారా జారీ చేసే లిఖిత పూర్వక ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు
జిల్లా లేదా రాష్ట్రస్థాయిలో నామినేషన్ కింద ఇచ్చే కాంట్రాక్టులు, కాంట్రాక్టు సర్వీసుల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈ 50 శాతంలో బిసిలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం వాటా ప్రకారం అమలు చేయాల్సి ఉంటుందన్నారు. వీటిలో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలి. వెనుకబడిన తరగతుల జాబితాలోని బిసి-ఇ గ్రూపులో ఉన్న అన్ని తరగతులను ముస్లిం మైనారిటీలుగా పరిగణిస్తూ ఈ చట్టాన్ని అమలు చేయాల్సి ఉందన్నారు. నోడల్ డిపార్ట్‌మెంట్ల నిబంధనల ప్రకారం పనులు
పొందేందుకు కాంట్రాక్టర్లుగా, సర్వీస్ కాంట్రాక్టర్లుగా తప్పనిసరిగా నమోదు చేయించుకోవా లన్నారు. కాంట్రాక్టు వర్కులకు పంచాయతీరాజ్ శాఖను నోడల్ డిపార్ట్‌మెంట్‌గా, పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను నోడల్ అధికారిగా, సర్వీసు కాంట్రాక్టులకు సాధారణ పరిపాలన శాఖ నోడల్ డిపార్ట్‌మెంట్‌గా, జిఎడి కార్యదర్శిని నోడల్ అధికారిగా, జిల్లా స్థాయిలో రెండింటికీ జిల్లా కలెక్టర్లే నోడల్ అధికారులుగా ఉంటారని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన సాల్వెన్స్ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ల నుంచి మూడు మాసాల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన నెలలోపు పనులకు సంబంధించిన వెబ్‌పోర్టల్‌ను రూపొందించ నున్నట్లు తెలిపారు. అన్ని కాంట్రాక్టుల్లో రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టుల పనులకు సంబంధించి నెల వారీ నివేదికలను అన్ని ఇంజనీరింగ్ విభాగాలు
సంబంధిత శాఖలకు, త్రైమాసిక నివేదికలకు సంక్షేమ శాఖలకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు
0 Response to "కాంట్రాక్టుల్లో 50 శాతం"
Post a Comment