ల్యాండర్‌ కోసం చంద్రుడి పైకి నాసా ఎల్‌ఆర్‌ఓ

న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్నా కొద్ది చంద్రయాన్‌-2 ఉపగ్రహానికి చెందిన ల్యాండర్‌ విక్రం పరిస్థితిపై మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా).. ఇస్రోకు సహకారం అందించడానికి ముందుకొచ్చింది కూడా. తాజాగా ల్యాండర్‌ విక్రం చంద్రుడిపై ల్యాండ్‌ అయిన ప్రదేశం మీదుగా తన రొబోటిక్‌ అంతరిక్షనౌక 'ఎల్‌ఆర్‌ఓ'ను నాసా నేడు(మంగళవారం) ప్రయోగించనున్నది.



 దీంతో ల్యాండర్‌కు సంబధించిన ఏదైనా కొత్త సమాచారం వెలువడే అవకాశం కనిపిస్తున్నది


అలాగే ల్యాండర్‌ విక్రం చిత్రాలను సైతం ఎల్‌ఆర్‌ఓ విడుదల చేసే అవకాశం ఉన్నదని యూఎస్‌ మీడియా తెలుపుతున్నది. ఈ చిత్రాలు చంద్రయాన్‌-2 మిషన్‌పై విశ్లేషణ కోసం ఇస్రోకు సహాయపడుతుందని ఎల్‌ఆర్‌ఓ ప్రాజెక్టు శాస్త్రవేత్త నోవాV్‌ా పెట్రో తెలిపారు. ల్యాండర్‌, రోవర్‌ల జీవిత కాలం 14రోజులు. అది ఈనెల 21తో ముగుస్తుంది.

దీంతో ల్యాండర్‌ విక్రంపై సమాచారం కోసం రోజులు దగ్గరపడుతున్నా కొద్ది అందరిలో టెన్షన్‌ నెలకొంటున్నది. దీంతో నాసా ఎల్‌ఆర్‌ఓ.. ఇస్రోకు ఒకింత ఆశను కలిగిస్తున్నది. ఈనెల 7న చంద్రుడిపైకి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించి ఆఖరు నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా ల్యాండర్‌ విక్రం సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఇస్రో.. ల్యాండర్‌ జాడను తెలుసుకున్నప్పటికీ సంబంధాల పునరుద్ధరణ కోసం.. దాని పరిస్థితి గురించి తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్నది



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ల్యాండర్‌ కోసం చంద్రుడి పైకి నాసా ఎల్‌ఆర్‌ఓ"

Post a Comment