25న కలెక్టరేట్ల వద్ద ఆందోళన : ఫ్యాప్టో

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో 
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాట కార్యక్రమానికి ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఈ నెల 25న అన్ని కలెక్టరేట్ల ఎదుట ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని కార్యకర్గ సమావేశం నిర్ణయించింది. ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం ఎపిటిఎఫ్‌ కార్యాలయంలో సోమవారం జరిగింది



. సమావేశ నిర్ణయాలను ఫ్యాప్టో ఛైర్మన్‌ జివి నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్‌ కె.నరహరి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపటం లేదని, అందువల్లే ప్రత్యక్ష పోరాటానికి పిలుపునిచ్చినట్లు తెలిపింది. విద్యాశాఖ మంత్రి తమతో చర్చలు జరిపి నెల రోజులు దాటినా చర్చల మినిట్స్‌ విడుదల చేయకపోవడం శోచనీయమని ప్రకటించింది



ఉపాధ్యాయుల బదిలీలు దసరా సెలవుల్లో నిర్వహించాలని కార్యవర్గ సమావేశం డిమాండ్‌ చేసింది. 
73, 74 జీవోలను అమలుచేస్తూ అన్ని కేడర్ల పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలని తీర్మానించింది. అప్‌గ్రేడ్‌ అయిన ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు స్టాఫ్‌ప్యాట్రన్‌ ప్రకారం టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులకు మంజూరు చేయాలని కోరింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తెలుగుమీడియం కొనసాగించాలని డిమాండ్‌ చేసింది. 500రోల్‌ దాటిన 


అన్ని యాజమాన్యాలలోని ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌2 తరగతులను ప్రారంభించాలని, జీవో 223ను రద్దు చేసి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు ఇవ్వాలని తీర్మానించింది. ఉపవిద్యాశాఖ అధికారులుగా పనిచేస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్లను తొలగించి సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను, ఎంఇవోలను నియమించాలని కోరింది. 
ఎస్‌సిఇఆర్‌టి, డైట్‌ కళాశాలల్లో సీనియర్‌ అధ్యాపకలుగా ప్రధానోపాధ్యాయులను నియమించాలని తీర్మానించింది. గత నోటీసుల్లో ఫ్యాప్టో ఇచ్చిన ఉపాధ్యాయుల, విద్యార్థుల, పాఠశాలల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. ఈ సమావేశంలో ఫ్యాప్టో కోఛైర్మన్లు షేక్‌ సాబ్జీ, జి నాగేశ్వరరావు, పి పాండు రంగవరప్రసాదరావు, 



కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ సిహెచ్‌ శరత్‌ చంద్ర, కార్యదర్శి కె ప్రకాష్‌, ట్రజరర్‌ జి శౌరి రాయులు, కార్యవర్గ సభ్యులు పి బాబురెడ్డి, సిహెచ్‌ సుధీర్‌ బాబు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "25న కలెక్టరేట్ల వద్ద ఆందోళన : ఫ్యాప్టో"

Post a Comment