విందాం - నేర్చుకుందాం-నేటి రేడియో పాఠం

17-9-19

<><><><><><><><><><>
💁‍♂ *"విందాం - నేర్చుకుందాం"*
📻 *నేటి రేడియో పాఠం*
★ తేది : 17.09.2019
★ విషయము : గణితం
★ పాఠం పేరు : "సమాన భాగాలు -సమాన సమూహాలు"
★ తరగతి : 4వ తరగతి
★ సమయం : 11-00 AM 
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰 
✳ *సమాన భాగాలు - సమాన సమూహాలు* 
〰〰〰〰〰〰〰〰 
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• ఇచ్చిన వస్తువులను సమాన సమూహాలుగా విభజించగలుగుతారు.
• భాగించడం ద్వారా సులభంగా సమాన సమూహాలుగా మార్చవచ్చని అవగాహన చేసుకుంటారు.
• విభాజ్యం, విభాజకం, భాగఫలం, శేషంల గురించి అవగాహన చేసుకుంటారు.
• భాగహారం అంటే ఆవర్తన వ్యవకలనం అనీ  గుణకారం ద్వారా భాగహారాన్ని సరిచూసుకోవచ్చని తెలుసుకుంటారు.
• నిత్యజీవిత సంఘటనలకు భాగహరాన్ని అన్వయించుకుంటారు.
• ఆట, పాటల ద్వారా శారీరక, మానసికోల్లాసాలు పెంపొందించుకుంటారు.
★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
• పాఠ్యపుస్తకం,
• పాఠ్యపుస్తకం 62 వ పేజీలోని “అ” చిత్రం గీచిన చార్ట్.
• 63 వ పేజీలోని “ఇ” చిత్రం గీచిన చార్ట్.
• పాట రాసి ఉంచిన చార్ట్.
★★★★★★★★
✡ *బోధనాభ్యసస కృత్యాలు :*
*ప్రసార పూర్వక కృత్యాలు :*
*కార్యక్రమంలో నిర్వహించబోయే “ఆట” ఆడించే విధానంపై అవగాహన కలిగియుండాలి.*
*ఆట:* 
• తరగతి గదిలో పిల్లలందరూ నిలబడగలిగే విధంగా పెద్ద వృత్తం గీయాలి.
• మ్యూజిక్ వినిపించినంత సేపు పిల్లలందరూ వృత్తం చుట్టూ పరుగెత్తాలి.
• మ్యూజిక్ ఆగిపోగానే పిల్లలు తిరగడం ఆపాలి.
• రేడియో టీచర్ సూచించిన విధంగా పిల్లలందరూ సమూహాలుగా ఏర్పడాలి. చెప్పిన సంఖ్య ప్రకారం వరుసలలో 
నిలబడాలి.
★★★★★★★★
✡ *కృత్యాలు : కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలి.* 
*కృత్యము :1:* 
• 9 బంతులను ఇద్దరికి సమానంగా పంచినప్పుడు విభాజకం, విభాజ్వం, భాగఫలం, శేషం ఎంతెంతో తరగతిలోని పిల్లలచే 
చెప్పించాలి.
• 24 కొవ్వొత్తులను 8 ప్యాకెట్లలో ఉంచితే ఒక్కొక్క ప్యాకెట్లో 3 ఉంటాయి. దీనిని గుణకార రూపంలో పిల్లలచే చెప్పించాలి. 
*కృత్యము :2:*
తరగతిలోని పిల్లలందరినీ రెండు సమూహాలుగా విభజించాలి.
• 62 వ పేజీలోని "అ" చిత్రం గీచిన చార్టును ప్రదర్శించాలి.
• ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఆ చిత్రంలోని ఏమిటి ? ఎన్ని ఉన్నాయి? చిత్రంలో ఎన్ని అడ్డువరుసలున్నాయి ఒక్కొక్క 
వరుసలో ఎన్ని ఉన్నాయి? పిల్లలచే చెప్పించాలి.
• పైన చూపించిన చిత్రాన్ని భాగహార రూపంలో పిల్లలచే చేయించాలి.
• 63వ పేజీలోని “ఇ” చిత్రం గీసిన చార్డును ప్రదర్శించాలి.
• ఒక విద్యార్థిచే అవేమిటి? ఎన్ని ఉన్నాయో చెప్పించాలి.
• మరొక విద్యార్థి చేత అడ్డువరుసలెన్నొ చెప్పించాలి.
• మరొక విద్యార్థి చేత అడ్డువరుసలో ఎన్ని ఉన్నాయో చెప్పించాలి.
• పైన చూపించిన చార్టులోని చిత్రాన్ని భాగహార రూపంలో రాయించాలి.
• మరొక విద్యార్థి చేత ఆ భాగహారాన్ని గుణకారం ద్వారా సరిచూడమనాలి.
• రేడియో టీచర్ సూచించిన భాగహారం చేయించి, విభాజ్యం, విభాజకం, భాగఫలం,శేషాలను పిల్లలచే చెప్పించాలి.
*కృత్యము :3:*
ఆటలో భాగంగా రేడియో టీచర్ సూచనలను అనుగుణంగా పిల్లలందరూ వరుసకు నలుగురు చొప్పున, 2 వరుసలోని 
సమానంగా, వరుసలో ఆరుగురు చొప్పున, 4 వరుసలలో సమానంగా ఇలా ఒక్కొక్కసారి ఒక్కోవిధంగా నిలబడాలి.
★★★★★★★★
*కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.*
🎼  *పాట (పాఠం పై గేయం):*
🎤 *పల్లవి :* 
బాలల్లారా మనమంతా - భాగహారము నేర్వాలి
సమానంగా పంచాలంటే - భాగహారము చెయ్యాలి  //బాలల్లారా //

🎻 *చరణం 1:*
భాగించాల్సిన సంఖ్యను మనము - విభాజ్యమని అంటాము
ఏ సంఖ్యతో మనము భాగిస్తాము - విభాజకమని దాన్నంటాము
భాగించగ వచ్చిన ఫలితాన్ని - భాగఫలమని అంటాము
మిగిలిపోయిన మొత్తాన్ని - శేషం అని మనమంటాము   //బాలల్లారా //

🎻 *చరణం 2:*
పొలాలనైనా స్థలాలనైనా - సమూహంలో పిల్లలనైనా
పండ్లూ ఫలాలు వస్తువులైనా - పంచవలసిన సొమ్మెంతైనా 
ఎక్కువ తక్కువ లేకుండా - సమభాగాలుగా చేయాలంటే
భాగహారము చెయ్యాలి - గుణకారంతో సరిచూడాలి  //బాలల్లారా //
★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విందాం - నేర్చుకుందాం-నేటి రేడియో పాఠం"

Post a Comment