24 నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు
ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఎఫ్‌ఏ-2 పరీక్షలను ఈనెల 24 నుంచి 27 వరకు నిర్వహించాలని డీఈవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 25న ఉదయం హిందీ, మధ్యాహ్నం సైన్స్/భౌతికశాస్త్రం, 26న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం జీవశాస్త్రం, 27న ఉదయం
సాంఘికశాస్త్రం, మధ్యాహ్నం ఎంఎల్ సంస్కృతం/వృత్తివిద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఆగస్టు, సెప్టెంబరు నెలల సిలబస్‌తోకూడిన ప్రశ్నపత్రాలను పాఠశాల స్థాయిలోనే తయారు చేసుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు రివైజ్డ్ సిలబస్ ప్రకారం ప్రశ్నపత్రాలను డీసీఈబీ ద్వారా రూపొందించి అందజేస్తామన్నారు
డీసీఈబీ రూపొందించే ప్రశ్నపత్రాలను సంబంధిత కీ కేంద్రాల నుంచి ఈనెల 23న తీసుకోవాలన్నారు. 6 నుంచి 10 వ తరగతి వృత్తివిద్య కోర్సుల విద్యార్థులకు ప్రశ్నపత్రాలను పాఠశాల స్థాయిలోనే తయారు చేసుకోవాలని తెలిపారు. సంబంధిత నమూనా ప్రశ్నపత్రాలను ఎంఈవోల నుంచి
పొందాలన్నారు. పరీక్షల నిర్వహణ అనంతరం మార్కులను రికార్డు పుస్తకంలో నమోదు చేయాలని పేర్కొన్నారు
0 Response to "24 నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు"
Post a Comment