Loans తీసుకున్నారా? : భారీగా తగ్గనున్న EMIలు

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) వడ్డీరేట్లు తగ్గించింది. రెపో, రివర్స్ రెపో రేట్లను భారీగా తగ్గించింది. వరుసగా నాలుగోసారి రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రెపో రేటు 5.40 శాతం, రివర్స్ రెపో రేటు 5.15 శాతానికి తగ్గించింది. రెపో, రివర్స్ రెపో రేటు భారీగా తగ్గింది. దీంతో హోం లోన్లు, వాహనాల కొనుగోలు, ఇతర కార్పొరేట్ రుణాలు తీసుకున్న వారి నెలవారీ EMIలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు ఎంపీసీ పరపతి సమీక్షను చేపట్టింది. ఈ సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) 0.35 శాతం కోత విధించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది.

గృహరుణాల రేట్లు తగ్గించిన SBI: 
దేశంలో అతిపెద్ద బ్యాంకు SBI కూడా తమ కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది


ఆర్బీఐ రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు తగ్గించిన కొన్ని గంటల్లోనే ఎస్బీఐ MCLR రుణాల రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. SBI సెంట్రల్ బ్యాంకు రేటు కోతలను ప్రోత్సహించేందుకు పెద్ద సేవింగ్స్ అకౌంట్ల రేట్లు, కొన్ని రుణ ఉత్పత్తులను రెపో రేటుకు అనుసంధానించడం వంటి చర్యలను తీసుకోనుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో త్వరలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. సవరించిన వడ్డీరేట్లన్నీ ఆగస్టు 10, 2019 నుంచి అమల్లోకి రానున్నాయి. 
దిగొచ్చిన వడ్డీరేట్లు : రెపో రేటు భారీగా తగ్గించిన ఆర్బీఐ 

SBI సవరించిన ఒక సంవత్సరం MCLR ఏడాదికి 8.25 శాతంగా ఉంది. అంతకుముందు ఇది 8.40 శాతంగా ఉందని SBI ఒక ప్రకటనలో తెలిపింది. రెండేళ్ల ఎంసిఎల్‌ఆర్ సంవత్సరానికి 8.50 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గగా, మూడేళ్ల రేట్లు 8.45 శాతానికి తగ్గించింది.

ఆర్బీఐ రెపో రేటులో కోత విధించడంతో MCLR రేట్లకు అనుసంధానం చేసిన ఎస్బీఐ హోం లోన్స్ ప్రస్తుతం ఏప్రిల్ 10, 2019 నుంచి 35 బేసిస్ పాయింట్ల వరకు చౌకగా ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది జూలై నుంచి ఎస్బీఐ రెపో రేటు అనుసంధానమైన హోంలోన్లపై ఆఫర్లు అందిస్తోంది.




రెపో రేటులో మార్పులు జరిగితే ఆటోమాటిక్‌గా కొత్త హోంలోన్లపై వడ్డీ రేట్లు కూడా మారిపోతాయి. ఆగస్టు 1న ఎస్బీఐ ఫిక్సడ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఆర్థిక సంవత్సరం 20నాటికి వడ్డీరేట్లలో 75 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Loans తీసుకున్నారా? : భారీగా తగ్గనున్న EMIలు"

Post a Comment