ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో మరో సరస్సు
కట్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఒక కొత్త సరస్సును నేపాల్‌లో ఇటీవలే కనుగొన్నారు. నేపాల్‌లో 4,919 మీటర్ల ఎత్తులో ఉన్న టిలిచో సరస్సే ఇప్పటివరకు ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశంలో ఉన్న సరస్సుగా పరిగణిస్తున్నారు.
కాగా..ఇటీవల ఒక పర్వతారోహకుల బృందం మనంగ్ జిల్లాలోని సింగర్‌ఖర్కా ప్రాంతంలో ఉన్న కజిన్ సరా సరస్సును కనుగొంది. ఆ బృందం తీసిన లెక్కల ప్రకారం కజిన్ సరా సరస్సు 5,200 మీటర్ల ఎత్తులో ఉంది
. 1500 మీటర్ల పొడవు, 600 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ సరస్సును అధికారికంగా గుర్తిస్తే ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఉన్న సరస్సుగా ఇదే రికార్డు సాధిస్తుంది
0 Response to "ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో మరో సరస్సు"
Post a Comment