వైఫై.. ఒక్కసారి నమోదైతే చాలు! దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడొచ్చు
వైఫై.. ఒక్కసారి నమోదైతే చాలు!
దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడొచ్చు
దిల్లీ: బహిరంగ వైఫైని ఉపయోగించే వారికిది శుభవార్తే. సదరు వైఫైతో అనుసంధానమయ్యేందుకు వ్యక్తిగత వివరాలను ఒకసారి నమోదు చేసుకుంటే చాలు, పదేపదే ప్రతిసారీ మొబైల్ ఫోన్‌లో సమాచారన్నంతా నింపాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడైనా వైఫైని ఉపయోగించుకోవచ్చు.
ఈ వెసులుబాటును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఒక మొబైల్ వినియోగదారుడు ఒకసారి తన వివరాలతో వైఫైకి
అనుసంధానమైతే.. తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, జియో వంటి అన్ని నెట్‌వర్క్‌లూ సదరు ఉపకరణాన్ని గుర్తించి అనుసంధానమవుతాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
0 Response to "వైఫై.. ఒక్కసారి నమోదైతే చాలు! దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడొచ్చు"
Post a Comment