పాత పింఛను విధానం తెచ్చే ప్రసక్తే లేదు

లోక్‌సభలో లిఖిత పూర్వకంగా తేల్చిచెప్పిన కేంద్రం


న్యూఢిల్లీ, జూలై 15: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పింఛను విధానాన్నే (ఎన్‌పీఎ్‌స) కొనసాగిస్తామని.. 2004కు ముందున్న పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) మళ్లీ తెచ్చే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. 



ఈ మేరకు లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. పాత విధానంలో.. పదవీ విరమణ చేసేనాటికి ఉన్న జీతం, సర్వీసు కాలం ఆధారంగా పింఛను అందేది. 


కానీ, 2004లో ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం ప్రకారం ఉద్యోగి జీతం నుంచి 10 శాతం మొత్తానికి ప్రభుత్వం కూడా అంతే మొత్తం కలిపి మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంది

వచ్చే లాభాల ఆధారంగా పింఛను ఇస్తారు. దీన్ని తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి చేయగా.. క్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలూ అమల్లోకి తెచ్చాయి. కానీ, ఈ కొత్త విధానంపై పలు ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామనే పార్టీలకే ఓటు వేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం.. పాత పింఛను విధానాన్ని పునఃప్రవేశపెట్టే అవకాశమే లేదని సోమవారం పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పడం గమనార్హం.

 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాత పింఛను విధానం తెచ్చే ప్రసక్తే లేదు"

Post a Comment