రోడ్లపై చెత్త తీసుకొస్తే చాలు ఫీజు కట్టాల్సిన అవసరమే లేదు!
బిహార్: బుద్ధగయలోని పద్మపాణి పాఠశాల పిల్లలు పుస్తకాల బ్యాగులతో పాటు...చెత్తబ్యాగుతో సహా రోజూ స్కూలుకు వస్తారు. వచ్చీరాగానే చెత్తబ్యాగును తీసుకెళ్లి అక్కడుండే చెత్తబుట్టలో పడేసి క్లాసుకెళ్లిపోతారు. వారంతా కూడా దాదాపు స్కూలుఫీజు కట్టరు. వారు ఏరుకువచ్చిన చెత్తే వారికి ఫీజుగా ఉపకరిస్తోంది. పాఠశాల ఏంటి! చెత్తఏమిటి! ఫీజేమిటి అంటారా! వివరాల్లోకి
వెళదాం...పద్మపాణిపాఠశాల పిల్లలు ఇంటినుంచి బయలుదేరి దారివెంట కనపడే చెత్తాచెదారాన్నంతా పోగుచేసుకుంటూ వస్తారు. అందులో ప్లాస్టిక్ సంచులు, సీసాలు, మూతలు, ఇతరత్రా చెత్త అంతా ఉంటుంది. దానిని తీసుకువచ్చి పాఠశాల ఆవరణలోనే ఉంచిన భారీ చెత్తడబ్బాలో వేస్తారు. తర్వాత ఆ చెత్తడబ్బా కాస్తా పునరుత్పాదక, పునర్వినియోగ ప్రక్రియకు
తరలిపోతుంది. తద్వారా వచ్చే డబ్బు పిల్లల ఫీజుకింద స్కూలుకెళ్లిపోతుంది. ఈ ప్రయోగంతో రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి. తల్లిదండ్రులకూ ఫీజుల భారం తప్పిపోతోందని పాఠశాల ఉన్నతాధికారి మనోరంజన్ ప్రసాద్ సందర్శి చెప్పారు. దాదాపు డజను గ్రామాల్లో పిల్లలు ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా నడిపిస్తున్నారు
0 Response to "రోడ్లపై చెత్త తీసుకొస్తే చాలు ఫీజు కట్టాల్సిన అవసరమే లేదు!"
Post a Comment