ఎక్కువ జీతంతో కొలువు పొందాలంటే..?



బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన ఫ్రెషర్‌... అత్యధిక పే ప్యాకేజీతో కూడిన ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి?

- వంశీ సీహెచ్‌




ఇంజినీరింగ్‌ చేసిన తర్వాత మంచి ప్యాకేజీతో తొలి కొలువు దక్కించుకోవాలంటే మొదటి సంవత్సరం నుంచి తగిన కృషి చేయాలి.

కానికల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు కోర్‌ జాబ్స్‌ చేయాలనుకుంటే మౌలిక అంశాలపై పట్టు సాధించాలి. ఇంజినీరింగ్‌ కాన్సెప్టులను ఆచరణాత్మంగా ఎలా అమలు చేయాలో కూడా నేర్చుకోవాలి. కంప్యుటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన ఉన్న మెకానికల్‌ ఇంజినీర్లకు ప్రస్తుతం చాలా డిమాండ్‌ ఉంది. కానీ ఆ నైపుణ్యాలతో ఉన్నవారు కొద్దిమందే మార్కెట్లో దొరుకుతున్నారు.

కళాశాలలో ఈవెంట్‌ కన్వీనర్‌గా టెక్నికల్‌ ఈవెంట్స్‌ను నిర్వహించి, విద్యార్థుల బృందానికి నేతృత్వం వహించటం వల్ల నిర్వహణ నైపుణ్యాలు పెరుగుతాయి. వేసవి సెలవుల్లో మినీ ప్రాజెక్టులు చేస్తూ పరిశ్రమలోని కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలి. జర్నల్స్‌లో, కాన్ఫరెన్సుల్లో టెక్నికల్‌ పేపర్లను సమర్పిస్తుండాలి. SAE India, ASHRAE లాంటి ప్రొఫెషనల్‌ సొసైటీల్లో సభ్యత్వం తీసుకుని, జాతీయస్థాయి కార్యక్రమాల్లో పాల్గొనాలి. దీనివల్ల లైవ్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులతో పరిచయం ఏర్పడుతుంది.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కోర్‌ పరిజ్ఞానంతో పాటు సీ++, జావా మొదలైన ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలపై పరిజ్ఞానం అవసరం. దీంతోపాటు ఈ నాలుగేళ్ల వ్యవధిలో విద్యార్థులు సమాజానికి మేలు చేసే సేవాసంస్థల కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.

మొత్తం మీద టెక్నికల్‌, సాఫ్ట్‌స్కిల్స్‌తో పాటు కో-కరిక్యులర్‌, ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఉంటే రెజ్యూమెకు విలువ పెరిగి, హై ప్రొఫైల్‌ మెకానికల్‌ కోర్‌ ఉద్యోగం పొందేందుకు వీలుంటుంది. గేట్‌ ద్వారా మంచి స్కోరు తెచ్చుకుంటే ఓఎన్‌జీసీ, ఐఓసీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో కొలువు చేజిక్కించుకోవచ్చు. వీటిలో ప్రారంభ వార్షిక వేతనమే సుమారు రూ.12 లక్షలుంటుంది.

- డాక్టర్‌ వి. ఉమామహేశ్వర్‌, మెకానికల్‌ విభాగం ఫ్యాకల్టీ, ఉస్మానియా వర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌,

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎక్కువ జీతంతో కొలువు పొందాలంటే..?"

Post a Comment