మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో తెలుసుకోండిలా
*💁మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో తెలుసుకోండిలా*...
⭐ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతిదానికి ఆధార్ కార్డు అడుగుతున్నాయి.
⭐పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు.. ఇలా దేనికైనా ఆధార్‌నే అడుగుతున్నారు.
⭐మన వ్యక్తిగత రుజువుగా ఇప్పుడు ఆధార్‌ను మించింది లేదు. దీంతో మనం కూడా ప్రతిదానికీ ఆధార్‌నే ఇస్తున్నాం.
⭐ఇందులో మన కంటిపాప, వేలి ముద్రలు, చిరునామా వంటి వివరాలన్నీ ఉంటాయి.
⭐ఇది దుర్వినియోగం అవుతున్నదన్న ఆందోళనలు కూడా ఉన్నాయి.
⭐ఈ నేపథ్యంలో మీ ఆధార్‌ను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారో తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?
⭐ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్‌సైట్ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
*🌺ఆధార్ వెబ్‌సైట్లో సర్వీసెస్ ట్యాబ్‌లో*
*యూఐడీఏఐ ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ పేజ్‌కు వెళ్లాలి*
👇👇👇👇👇👇👇
(https://resident.uidai.gov.in/notification-aadhaar).
▪అక్కడ కుడివైపు కింద ఆధార్ సర్వీసెస్ అనే ట్యాబ్ ఉంటుంది.
- మీ ఆధార్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
*🌺ఇలా చేయండి*
▪ఆ తర్వాత జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
▪మీ మొబైల్ నంబరుకు ఓటీపీ వచ్చేందుకు ఆధార్ వెబ్‌సైట్లో మొబైల్ నంబరు నమోదయి ఉండాలని మరవకండి.
▪ తర్వాతి పేజీలో మీకు ఎలాంటి సమాచారం కావాలో కోరుతూ కొన్ని ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి.
▪బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్‌లాంటివి. ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు.
*🌺కావాల్సిన వివరాలు ప్రత్యక్షం*
▪చివరి కాలమ్‌లో ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే మొత్తం మీకు కావాల్సిన వివరాలు ప్రత్యక్షమవుతాయి.
▪మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పని కోసం ఆధార్‌ను ఇచ్చారన్న వివరాలు వస్తాయి.
▪ అయితే ఇందులో మీ ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు.
▪అనుమానం వస్తే లాక్ చేయండి
అందుకోసమే మీకు ఏదైనా అనుమానం వస్తే మీ ఆధార్ వివరాలు మీరు అనుమతిస్తేనే అవతలి వాళ్లు వాడుకునేలా చేయొచ్చు.
▪ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను లాక్ చేయవచ్చు
▪ఏదైనా ఏజెన్సీ లేదా సంస్థ ఆ వివరాలను తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అన్‌లాక్ చేయవచ్చు.
0 Response to "మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో తెలుసుకోండిలా"
Post a Comment