SBI ఎస్సెమ్మెస్ అలర్ట్: ఇలా యాక్టివేట్ చేసుకోండి
*💁SBI ఎస్సెమ్మెస్ అలర్ట్: ఇలా యాక్టివేట్ చేసుకోండి*
⭐మీ బ్యాంక్ అకౌంట్ సురక్షితంగా ఉండటం మీ చేతుల్లో ఉంది. మన అకౌంట్‌లోని డబ్బులు భద్రంగా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలి
⭐ఇందుకు ఎస్సెమ్మెస్ సేవలు ఎంతో ఉపయోగపడతాయి. అది ఏ బ్యాంక్ అయినా ఎస్సెమ్మెస్ అలర్ట్ ఉంటే మంచిది.
⭐మనం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయగానే సందేశం వచ్చేలా యాక్టివేట్ చేసుకోవాలి.
⭐అలా అయితే మీ డబ్బులు ఎవరైనా డ్రా చేసినా వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి మీకు తెలియకుండా డబ్బులు డ్రా అనే సమస్య ఉండదు.
⭐ఎస్సెమ్మెస్ అలర్ట్ ఉంటే మీ అకౌంటుకు సంబంధించిన సమాచారం అంటే పాస్‌వర్డ్ మార్చినప్పుడు, లాగిన్ అయిప్పుడు కూడా తెలిసిపోతుంది.
⭐మీ అకౌంట్ లావాదేవీలకు సంబంధించి అలర్ట్స్ వస్తాయి.
*💁ఎస్బీఐలో ఎటీఎం అలర్ట్ ఇలా యాక్టివేట్ చేసుకోండి.*
*🔹ఏటీఎం సెంటర్*
🔹ఏదైనా ఏటీఎం సెంటర్‌కు వెళ్లండి.
🔹మీ ఏటీఎం కార్డు ఇన్‌సర్ట్ చేయండి.
🔹Mobile Registrationను సెలక్ట్ చేయండి.
🔹SMS/Mobile Registrationకు వెళ్లండి.
🔹ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. మెసేజ్ అలర్ట్ ఏ నెంబర్‌కు కావాలో అడుగుతుంది.
🔹మీరు మొబైల్ నెంబర్ కన్‌ఫర్మ్ చేశాక, రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది.
🔹మీ ట్రాన్సాక్షన్ స్లిప్ పైన కూడా 'Your request for registration has been accepted' అని వస్తుంది.
🔹ఒకవేళ సక్సెస్ కాకుంటే మరోసారి పైవిధంగానే చేయండి. ఏదైనా సమస్య వస్తే మాత్రం బ్యాంకుకు వెళ్లి సమస్య ఏమిటో తెలుసుకోండి.
*💁ఆన్‌లైన్ ద్వారా*
👉మొదట
🔹https://www.onlinesbi.com/ వెబ్ సైట్‌లోకి లాగిన్ అవండి.
🔹మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
🔹ఈ-సర్వీసెస్ సెక్షన్‌లో ఎస్సెమ్మెస్ అలర్ట్ పైన క్లిక్ చేయాలి.
🔹తర్వాత ఎస్సెమ్మెస్ అలర్ట్స్ రిజిస్ట్రేషన్/అప్‌డేషన్ పేజీ కనిపిస్తుంది.
🔹అక్కడ అడిగిన సమాచారం ఇచ్చి, సబ్‌మిట్ చేయాలి. తర్వాత ఎస్బీఐ అలర్ట్ యాక్టివేట్ అవుతుంది.
*👉గుర్తుంచుకోవాల్సిన విషయాలు*
⭐మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ అలర్ట్స్ వస్తాయి.
⭐ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కే అలర్ట్స్ వస్తాయి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ కాకుంటే సంబంధిత బ్రాంచికి వెళ్లండి.
-⭐మీ అకౌంట్ ఆక్టివిటీ పైన ఎస్సెమ్మెస్ అలర్ట్ ఆధారపడి ఉంటుంది.
⭐ఫోన్ నెంబర్ యాడ్ లేదా అప్‌డేట్ కోసం బ్రాంచికి వెళ్లండి
0 Response to "SBI ఎస్సెమ్మెస్ అలర్ట్: ఇలా యాక్టివేట్ చేసుకోండి"
Post a Comment