AP TEACHERS OFFICIAL. ID CARDS
*ఉపాధ్యాయులకు త్వరలో గుర్తింపు కార్డులు*
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన అనంతరం గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు.
ప్రస్తుతం ఏపీలోని అన్ని పాఠశాలల్లో కలిపి 2,86,818 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖ తరఫున ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. దీంతో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు విధులకు పూర్తిగా గైర్హాజరవుతున్నారు. అంతేగాకుండా, తమ తరఫున ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారిచేత విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ గుర్తింపుకార్డులు జారీ చేస్తే.. పాఠశాలల తనిఖీ సమయంలో ఈ తరహా అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు భావిస్తున్నారు.
OFFICIAL. ID CARDS
INTRODUCTION
BY EDN department
Some details
Download
CVPRASAD
0 Response to "AP TEACHERS OFFICIAL. ID CARDS"
Post a Comment