*ఉపాధ్యాయుల బదిలీల చట్టం పై ఏపీటీఎఫ్ అమరావతి డాక్యుమెంట్*

*ఉపాధ్యాయుల బదిలీల చట్టం పై ఏపీటీఎఫ్ అమరావతి డాక్యుమెంట్*


ఉపాధ్యాయుల బదిలీలు చట్టం- 2025 లో  ఉండాల్సిన విధివిధానాలను ప్రపోజ్ చేస్తూ ఏపీటీఎఫ్ అమరావతి డాక్యుమెంట్ ను రాష్ట్ర విద్యాశాఖ  అధికారులకు సమర్పించినట్లు ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు సివి ప్రసాద్ తెలియజేశారు. బతిలీల చట్టం ప్రారంభం నుండి చివరి వరకు ఏ విధంగా  ఉండాలన్న ప్రతిపాదనలు విద్యాశాఖకు తెలియజేసినట్లు తెలిపారు. సమాంతర మాధ్యమాన్ని పాఠశాలల్లో అమలు చేసిన తర్వాతనే 117 ఉత్తర్వులు రద్దుచేసి మిగులు పోస్టులను సర్దుబాటు చేసేలా బదిలీల చట్టంలో పొందుపరచాలని సూచనలు ఇచ్చారు. పెర్ఫార్మన్స్ పాయింట్ల రద్దు, పాఠశాలల కేటగిరీల్లో మార్పులు, మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహణ, ప్రాధాన్యత క్రమాలు, విద్యాసంవత్సరాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు.


*ఉపాధ్యాయ బదిలీల చట్టం- 2025- ఏపీటీఎఫ్ అమరావతి ప్రతిపాదనలు*


ప్రతి విద్యా సంవత్సరం షెడ్యూల్ 

ఏప్రిల్ 24 నుండి - జూన్ 11 వరకు 

బదిలీలు ,పదోన్నతులు, నియామకాలు సీక్వెన్సీలో ప్రక్రియ నిర్వహణ 


ప్రతిపాదిత షెడ్యూల్ 

రేసనలైజేషన్ - ఏప్రిల్ 24 నుండి 28 వరకు 

ఖాళీల ప్రదర్శన ఏప్రిల్ 29 

ఆన్లైన్ దరఖాస్తు ఏప్రిల్ 30 నుండి  మే3 వరకు 

ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా మే 5 

అభ్యంతరాల స్వీకరణ 6 నుంచి 9 మే 

చివరి జాబితా విడుదల 12 మే

(వెబ్ ఆప్షన్స్ 13 మే నుండి 19 మే వరకు )

(బదిలీ ఉత్తర్వులు. 23 మే నుండి 26 మే వరకు )

మాన్యువల్ కౌన్సిలింగ్ 

 హెచ్ఎం గ్రేడ్ 2 - 13 నుండి 15 వరకు మే 

స్కూల్ అసిస్టెంట్ 16 నుండి 21 వరకు మే 

సెకండరీ గ్రేడ్ టీచర్స్ 22 నుండి 31 వరకు మే


బదిలీ ఉత్తర్వులు 

 హెచ్ఎం గ్రేడ్ 2 - జూన్ 2

స్కూల్ అసిస్టెంట్ జూన్ 3

సెకండరీ గ్రేడ్ టీచర్స్ జూన్ 4 


పాఠశాలల్లో చేరిక జూన్ 10



గమనిక-  వెబ్ ఆప్షన్స్ స్థానంలో కౌన్సిలింగ్ విధానాన్ని మాన్యువల్ గా జరపాలి 



*ప్రతిపాదిత బదిలీ నిబంధనలు*


*మే 31వ తేదీ నాటికి ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో రెండుల్లు సర్వీస్( విద్యా సంవత్సరాలు) పూర్తి చేసిన ఉపాధ్యాయులందరూ బదిలీలు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు* 


*ఇలాగే మే 31 నాటికి అన్ని క్యాడర్లలో ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసిన వారందరినీ దీర్ఘకాలిక సర్వీస్ (లాంగ్ స్టాండింగ్) గా పరిగణించాలి*


*లాంగ్ స్టాండింగ్ పరిధిలోని వారు ఖచ్చితంగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి* 


*మే 31 నాటికి రెండేళ్ల లోపు పదవి విరమణ చెందబోయే వారు లాంగ్ స్టాండింగ్ నుంచి మినహాయింపు. బదిలీకి కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు*


*బాలిక ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు మాత్రమే బదిలీ కోరుకొనుటకు అర్హులు* 


*బాలిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులు కచ్చితంగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి*


*ప్రాధాన్యత క్రమం (ప్రిపరెన్సీఎల్ కేటగిరి)*


వికలాంగులు ( 60 శాతం), వితంతువులు, విడాకులు తీసుకున్న స్త్రీలు, దీర్ఘకాలిక సబ్బులు ( క్యాన్సర్/ ఓపెన్ హార్ట్ సర్జరీ తో సహా న్యూరో సర్జరీ / బోన్ టీబీ. మూత్రపిండాల మార్పిడి /డయాలసిస్ కలిగిన (సెల్ఫ్/ పేరెంట్స్/ చిల్డ్రన్స్), మానసిక వికలాంగత(తల్లిదండ్రులు/ దంపతులు/పిల్లలు) కలిగిన వారు, జువేనియల్ డయాలసిస్ మరియు గుండెలో రంద్రాలున్న పిల్లలున్నవారు.


నోట్: ఆరు నెలల లోపు జిల్లా /రాష్ట్ర స్థాయి మెడికల్ బోర్డు వైద్య ధ్రువీకరణ పత్రం రుజువు గా ఉండాలి



*పాఠశాలలు విభజన- కేటగిరీలు*


16% హెచ్ఆర్ఏ ప్రాంతాలు కేటగిరి 1 

12 శాతం హెచ్ఆర్ఏ ప్రాంతాలు కేటగిరీ 2 

10 శాతం హెచ్ఆర్ఏ ప్రాంతాలు- కేటగిరి 3 (మండల కేంద్రం నుండి ఏడు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతాలు కేటగిరీ 3(ఏ)గాను, ఏడు కిలోమీటర్ల అంటే ఎక్కువ దూరం ఉన్న ప్రాంతాలు కేటగిరి 3(బి) గాను, అసలు రవాణా సౌకర్యమే లేని ప్రాంతాలు కేటగిరి 3(సి )గాను 


నోట్: 3(సి ) ప్రాంతాలను పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు 


*ఎన్ టైటిల్ పాయింట్స్*


ఉపాధ్యాయ బదిలీలు సర్వీస్ ప్రాతిపదికన, ప్రాధాన్యత ప్రాతిపదికన భౌతిక కౌన్సిలింగ్ ద్వారా జరగాలి. *ఎన్ టైటిల్ పాయింట్స్* సర్వీస్ ప్రాతిపదికన మంజూరు చేయాలి 

1) పాఠశాల సర్వీసు ప్రతి సంవత్సరానికి...

క్యాటగిరి 1 ప్రాంతాలకు ఒక పాయింట్ చొప్పున 

క్యాటగిరి 2 ప్రాంతాలకు రెండు పాయింట్లు చొప్పున 

క్యాటగిరి 3 (ఎ) ప్రాంతాలకు మూడు పాయింట్లు చొప్పున క్యాటగిరి 3( బి) ప్రాంతాలకు నాలుగు పాయింట్లు చొప్పున కేటగిరి 3 (సి) ప్రాంతాలకు ఐదు పాయింట్ల చొప్పున వెయిటేజ్ కల్పించాలి 


2) అన్ని క్యాడర్లలో మొత్తం సర్వీసు ను ప్రతి సంవత్సరం మే 31 నాటికి లెక్కించి ప్రతి సంవత్సరమునకు అర్థ పాయింటు చొప్పున వెయిటేజీ కల్పించాలి. గరిష్టంగా 16.5 పాయింట్లు ఉండాలి 


3) ప్రత్యేక కేటగిరీలకు అదనంగా పాయింట్లు (స్పెషల్ కేటగిరి పాయింట్లు)

ఎ) ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలకు పాయింట్లు రద్దు 

బి) మే 31 నాటికి రెండేళ్ల లోపు పదవీ విరమణ చెందు వారికి ఐదు పాయింట్లు 

సి) 40 ఏళ్ల వయస్సు పైబడిన అవివాహిత మహిళలకు 5 పాయింట్లు 

డి) రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్, లోకల్ బాడీ ,ఎయిడెడ్ సంస్థలలో పనిచేస్తున్న స్పౌజు కేసులు దగ్గర పాఠశాలలకు బదిలీ అగుటకు ఐదు పాయింట్లు చొప్పున వెయిటేజ్


నోట్: స్పౌజ్ కేటగిరీ /అవివాహిత మహిళలు కింద స్పెషల్ పాయింట్లు 8 విద్యా సంవత్సరాలకు  ఒకసారి మాత్రమే పొందుటకు అర్హులు. 

స్పౌజ్ కేటగిరీ కింద 25 కిలోమీటర్ల పరిధిలోనే బదిలీ కోరుకోవాలి 


*అదనపు పాయింట్లు*

ఎన్సిసి / స్కౌట్ అధికారికి అదే యూనిట్ ప్రాంతానికి కోరుకోవడానికి అదనంగా 5 పాయింట్లు 


లాంగ్ స్టాండింగ్ కానీ రేసనలైజేషన్ ఉపాధ్యాయునికి అదనంగా మూడు పాయింట్లు (సీనియర్ కైనా, జూనియర్ కైనా)


40 నుండి 60 వరకు వికలాంగత గల వారికి అదనంగా మూడు పాయింట్లు


నోట్: సమాన పాయింట్లు వచ్చినప్పుడు సీనియార్టీ కి ప్రాధాన్యత 


*పెర్ఫార్మన్స్ పాయింట్లు*

అవార్డులు /సైన్స్ ఫెయిర్/ రచయితలు / నిధులు సేకరణ/ స్పోర్ట్స్ గేమ్స్ ... ఇతరములు లకు గతంలో మంజూరు చేస్తూ ఉన్న పెర్ఫార్మెన్స్ పాయింట్లను రద్దు చేయాలి


*ఇతరములు*

ఇద్దరూ అంతకంటే ఎక్కువ మందికి సమానంగా వెయిటేజ్ పాయింట్లు వచ్చినప్పుడు 40 నుండి 70% మధ్య వికలాంగతగల ఉపాధ్యాయులకు మొదటి ప్రాధాన్యత ,వికలాంగత లేనప్పుడు సీనియర్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత, తదుపరి పుట్టిన తేదీ ప్రకారం వయసు ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యం 


కచ్చితంగా బదిలీ కావలసిన ఉపాధ్యాయుడు దరఖాస్తు చేసుకోకుండా ఉన్న ,కౌన్సిలింగ్ కు హాజరు కాకున్నా కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీల లోకి సర్దుబాటు చేయాలి.


కేటగిరి వారి బదిలీలు కేటగిరి ఒకటిలో పనిచేస్తున్న వారిని కేటగిరి 3 సి కి, క్యాటగిరి 2 లో పనిచేస్తున్న వారిని కేటగిరి 3 బి కి బదిలీ అయ్యేటట్లు చూడాలి


*కమిటీలు*

1. ప్రభుత్వం పాఠశాలల ప్రధానోపాధ్యాయుల జోనల్ బదిలీల కమిటీ 

1)సీనియర్ అధికారి- జాయింట్ డైరెక్టర్ స్థాయి-కమిటీ ఛైర్మన్

2)ఆర్ జె డి- మెంబర్ కన్వీనర్

3) డీఈవో- మెంబర్


*జిల్లా పరిషత్ హెచ్ఎంల జిల్లాస్థాయి బదిలీల కమిటీ*


జిల్లా పరిషత్ చైర్మన్ / స్పెషల్ ఆఫీసర్ - చైర్మన్ 

కలెక్టర్ /జాయింట్ కలెక్టర్. - మెంబర్

ఆర్జెడి -మెంబర్ సెక్రెటరీ 

జడ్పీ సీఈవో-మెంబర్


*జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల జిల్లా స్థాయి బదిలీల కమిటీ*


జిల్లా పరిషత్ చైర్మన్ / స్పెషల్ ఆఫీసర్ - చైర్మన్ 

కలెక్టర్ /జాయింట్ కలెక్టర్. - మెంబర్

డిఇఓ -మెంబర్ సెక్రెటరీ 

జడ్పీ సీఈవో-మెంబర్


*అప్పీలు*

బదిలీలలో ఏవైనా అవకతవకలు జరిగితే ఉపాధ్యాయులు న్యాయం కోసం అప్పిలుకు అవకాశం జిల్లా విద్యాశాఖ అధికారి పై ఆర్ జె డి కి, ఆర్ జె డి పై డిఎస్పి కి బదిలీ ఉత్తర్వునిచ్చిన 15 రోజుల్లో అప్పిలుకు అవకాశం. సంబంధిత అధికారి 15 రోజుల్లో పరిష్కారం





DOWNLOAD APTF AMARAVATHI TRANSFER ACT DOCUMENTARI





ముగింపు- అన్ని దశలు ఆన్లైన్లోనే నిర్వహించాలి. వెబ్ ఆప్షన్ల స్థానంలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి


 




 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "*ఉపాధ్యాయుల బదిలీల చట్టం పై ఏపీటీఎఫ్ అమరావతి డాక్యుమెంట్*"

Post a Comment