*NPS Vatsalya scheme* : 18 నుంచి ఎన్పీఎస్ వాత్సల్య.. ప్రారంభించనున్న నిర్మలా సీతారామన్
█► *`CVPRASAD`*◄█
█► *`APTF AMARAVATHI`*◄█
*Breaking news*
*NPS Vatsalya scheme*
: 18 నుంచి ఎన్పీఎస్ వాత్సల్య.. ప్రారంభించనున్న నిర్మలా సీతారామన్
NPS Vatsalya scheme | ఢిల్లీ: తమ పిల్లల భవిష్యత్
కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం
బడ్జెట్లో ప్రకటించిన ఎన్పీఎస్ వాత్సల్యను (NPS
Vatsalya) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
సెప్టెంబర్ 18న ప్రారంభించనున్నారు. పెన్షన్ ఫండ్
రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA),
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి,
ఆర్థిక శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో
పాల్గొంటారని సమాచారం. పథకం ప్రారంభంతో
పాటు విధివిధానాలు తెలియజేయనున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి, ఆర్థిక శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. పథకం ప్రారంభంతో పాటు విధివిధానాలు తెలియజేయనున్నారు.
18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు/ సంరక్షకులు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా తీసుకోవచ్చు.
పిల్లలు మేజర్లు అయ్యాక ఈ ఖాతా సాధారణ ఎన్పీఎస్ (NPS) ఖాతాగా మారుతుందని జులైలో ప్రకటించిన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
దేశంలోని ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2004లో తీసుకొచ్చిన ఎన్పీఎస్.. పన్ను ప్రయోజనాలతో పాటు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని ఇప్పుడు మరింత విస్తృత పరుస్తూ మైనర్లకూ వాత్సల్యను అందుబాటులోకి తేవడం గమనార్హం
. సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ వంటి మదుపు పథకాలకు ఇది అదనం.
ఎన్పీఎస్ వాత్సల్య వల్ల ముందుగానే పెట్టుబడులు ప్రారంభించడానికి వీలు పడుతుంది. దీనివల్ల చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది.
మైనర్లుగా ఉన్నప్పుడే ఎన్పీఎస్ ఖాతా తెరవడం వల్ల రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్ సమకూరుతుంది. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా వల్ల చిన్నతనంనుంచే తమ పిల్లలకు నుంచే పొదుపు అలవాటు చేయొచ్చు.
సాధారణంగా ఎన్పీఎస్లో టైర్-1, టైర్-2 ఖాతాలుంటాయి. టైర్-1 ప్రాథమిక పింఛను ఖాతా.
0 Response to "*NPS Vatsalya scheme* : 18 నుంచి ఎన్పీఎస్ వాత్సల్య.. ప్రారంభించనున్న నిర్మలా సీతారామన్"
Post a Comment