మే నెలలో బ్యాంకులకు సెలవులు



మే నెలలో బ్యాంకులకు సెలవులు


మే నెలలో బ్యాంకులకు సంబంధించిన ముఖ్యమైన పనులకు ఏమైనా ప్రణాళిక రూపొందించుకుంటే దాన్ని మారు మార్చుకోవాల్సి వస్తుంది. ఈ నెలలో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి


ఏకంగా 12 రోజులపాటు బ్యాంకులను మూసేస్తారు. దీన్ని గమనించి ఇతర మార్గాల్లో పనులు పూర్తిచేసుకోవడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. మేలో ఏయే నెలల్లో బ్యాంకులు మూసేస్తారో తెలుసుకుందాం. హాలిడే అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్' ప్రకారం ఎక్కువ సెలవులు వచ్చాయి.

రెండు, నాలుగో శనివారాలతోపాటు నాలుగు ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, వివిధ రాష్ట్రాల్లోని స్థానిక సెలవు రోజుల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులను మూసేస్తారు. సెలవులను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు బ్యాంకింగ్ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది. సెలవులు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు విదేశీ మారక ద్రవ్య సేవలు వంటి ఎమర్జెన్సీ ట్రాన్సాక్షన్స్ కోసం నిర్దిష్ట సెలవు దినాలలో కొన్ని శాఖలను తెరిచి ఉంచుతాయి. ATM సేవలు, క్యాష్ డిపాజిట్ మెషీన్‌లు, ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు సెలవు రోజులన్నింటిలో కూడా కొనసాగుతాయి.

2023 మే నెలలో బ్యాంక్ సెలవుల లిస్ట్

* మే 1 (సోమవారం): మే డే, మహారాష్ట్ర డే

* మే 5 (శుక్రవారం): బుద్ధ పూర్ణిమ - పశ్చిమ బెంగాల్ , ఉత్తరాఖండ్ , అస్సాం, బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ , గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వర్తిస్తుంది.

* మే 7: ఆదివారం

* మే 9 (మంగళవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినోత్సవం

* మే 13: రెండో శనివారం

* మే 14: ఆదివారం

* మే 16 (మంగళవారం): సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం (సిక్కిం)

* మే 21: ఆదివారం

* మే 22 (సోమవారం): మహారాణా ప్రతాప్ జయంతి - గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల వరకు.

* మే 24 (బుధవారం): కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి - త్రిపుర రాష్ట్రానికి

* మే 27: నాలుగో శనివారం

* మే 28: ఆదివారం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మే నెలలో బ్యాంకులకు సెలవులు"

Post a Comment