పాఠశాలల విలీనంపై కౌంటర్‌ దాఖలు చేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. విచారణ 5కు వాయిదా


అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల విలీనం, ఉపాధ్యాయులు హేతబద్ధీకరణను సవాల్‌చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న కేంద్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్‌, తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో వ్యాజ్యంతో ఈ పిల్‌ను జత చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయులు హేతుబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 117, 128, 84, 85లను సవాల్‌ చేస్తూ డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిల్‌ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నిబంఽధనలకు విరుద్ధంగా చేస్తున్నారన్నారు. కాగా, ఉపాధ్యాయుల సర్వీస్‌ వ్యవహారానికి సంబంధించి పిల్‌ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, ఇది సర్వీ్‌సతో ముడిపడిన వ్యవహారం కాదని, విద్యాహక్కు చట్టంతో ముడిపడి ఉందని న్యాయవాది తెలిపారు. ఆర్‌టీఈ చట్టం మేరకు ప్రతి 60మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉండాలని, ప్రభుత్వం ఆ నిష్పత్తిని పాటించడం లేదన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన మాతృభాషలో ఉండాలని ఆర్‌టీఈ చట్టం చెబుతోందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల విలీనంపై కౌంటర్‌ దాఖలు చేయండి"

Post a Comment