1 నుంచి టీచర్లకు ఆన్‌లైన్‌ హాజరు

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా కొవిడ్‌ నేపథ్యంలో దూరమైన ఆన్‌లైన్‌ హాజరు విధానాన్ని పాఠశాల విద్యాశాఖ పునరుద్ధరిస్తోంది. ఆగస్టు 1 నుంచి ఉపాధ్యాయులంతా వారి సొంత ఫోన్లలోనే ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ విధానంలో హాజరును నమోదుచేయాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ రూపొందించినట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన వెబ్‌ఎక్స్‌ సమావేశంలో స్పష్టంచేశారు. అలాగే చైల్డ్‌ ఇన్ఫో నమోదు ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఉదయం 10.30గంటలలోపు ఏ ఒక్క విద్యార్థికి హాజరు వేయకపోయినా హెచ్‌ఎంతోపాటు, ఎంఈవో, డీఈవోలకు షోకాజ్‌ నోటీసులు వస్తాయని స్పష్టంచేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "1 నుంచి టీచర్లకు ఆన్‌లైన్‌ హాజరు"

Post a Comment