కరెన్సీ నోట్లపై ఠాగూర్, కలాం ఫొటోలు
కసరత్తు చేస్తున్న ఆర్బీఐ, ఆర్థిక శాఖ
నిపుణుల పరిశీలనకు డిజైన్లు
న్యూఢిల్లీ, జూన్ 5: దేశంలో కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోలను మాత్రమే ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే కొత్త నోట్లపై మరో ఇద్దరు ప్రముఖులు.. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలను కూడా ముద్రించాలని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. గాంధీ ఫొటో ఉన్న నోట్లు ఎప్పటిలాగే చలామణిలో ఉంటాయి. కొత్తనోట్లపై మాత్రమే ఠాగూర్, కలాం ఫొటోలను ముద్రిస్తారు. ఫొటోల డిజైన్‌ను ఇప్పటికే కేంద్రం ఆమోదించినట్టు తెలిసింది. గాంధీ కొత్త ఫొటోలతో పాటు ఠాగూర్, కలాం ఫొటోలను ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్ దిలీప్ షహానీకి పంపినట్టు సమాచారం. ఎలకో్ట్రమాగ్నెటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ రంగంలో నిపుణుడైన ప్రొఫెసర్ దిలీప్ షహానీ సెక్యూరిటీ తదితర అంశాలను పరిశీలించి ఫొటోలను కేంద్రానికి సిఫార్సు చేస్తారు. 2017లో ఆర్బీఐ నియమించిన ఓ అంతర్గత కమిటీ.. కరెన్సీ నోట్లపై సెక్యూరిటీ ఫీచర్లను పెంచడంలో భాగంగా గాంధీతోపాటు ఠాగూర్, కలాం ఫొటోలను కూడా ముద్రించాలని 2020లో సిఫార్సు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అవసరమైన డిజైన్లను తయారు చేయాలని మైసూర్, హోసంగాబాద్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లను ఆర్బీఐ ఆదేశించింది
0 Response to "కరెన్సీ నోట్లపై ఠాగూర్, కలాం ఫొటోలు"
Post a Comment