ఏడో తరగతి విద్యార్థి పేరిట విద్యుత్ మీటరట
అమ్మఒడికి దూరం చేసిన అధికారుల నిర్వాకం
గుమ్మలక్ష్మీపురం, జూన్ 5: ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి పేరిట విద్యుత్ మీటరు ఉందని చూపారు. నెలకు రూ.400 బిల్లు వస్తుందని అమ్మఒడి కట్ చేశారు. జాబితాలో చోటులేకపోవడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సందిగూడలో వెలుగుచూసిందీ ఘటన. గ్రామానికి చెందిన బిడ్డిక రాజేష్ కురుపాం ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు.
అమ్మఒడికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయంలో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. అందులో రాజేష్ తల్లి సావిత్రమ్మ పేరు లేదు. ఇదేమని సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తే రాజేష్ పేరిట విద్యుత్ మీటరు ఉందని.. నెలకు రూ.400కు పైగా విద్యుత్ బిల్లు వస్తుందని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు
0 Response to "ఏడో తరగతి విద్యార్థి పేరిట విద్యుత్ మీటరట"
Post a Comment