✍️పాఠ్యపుస్తకాలేవి?✍️📚* *♦️ఇండెంట్లో సగమూ రాలేదు.*

*📚

*🌻ఈనాడు-అమరావతి*
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గడిచిన విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాలు సకాలంలో అందలేదు. చాలా రోజులు పుస్తకాల్లేని చదవులకే విద్యార్థులు పరిమితమయ్యారు. వేసవి సెలవులు అనంతరం స్కూళ్ల పునఃప్రారంభం రోజునే జగనన్న విద్యా కానుక కిట్లలో పాఠ్య పుస్తకాలను పెట్టి పంపిణీ చేస్తామని పేర్కొన్నా ఆచరణలో అది సాధ్యం కాలేదు. పాఠశాలలు ప్రారంభమైన మూడు మాసాలకు కూడా పూర్తిస్థాయిలో పంపిణీకి నోచుకోలేదు. చాలామంది పేద విద్యార్థులు వ్యయ, ప్రయాసలకోర్చి మార్కెట్లో షాపుల్లో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసుకుని పుస్తకాలను సమకూర్చుకున్నారు. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా కార్యాచరణ ఉంటుందనుకుంటే గతేడాది మాదిరే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కొన్ని తరగతులకు సంబంధించి ఒక్క పుస్తకం కూడా ముద్రణకు నోచుకోలేదు. అవి ముద్రితమై గోదాముకు చేరుకుని అనంతరం స్కూల్‌ పాయింట్‌కు ఎప్పుటికి చేరతాయో అర్ధం కావడం లేదు.

 ♦️ఈ ఏడాది ప్రభుత్వ విద్యార్థులకే కాదు ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు ప్రభుత్వమే వాటిని ముద్రించి పంపుతుందని చెప్పి ఇండెంట్లు స్వీకరించింది. ఆంగ్ల మాధ్యమంలో ఏమైనా సందేహాలు వస్తే వెంటనే దాన్ని విద్యార్థి నివృత్తి చేసుకోవటానికి సమాంతరంగా తెలుగు మీడియంలో కూడా ముద్రించి ఒకే పుస్తకంలో లభ్యమయ్యేలా చూస్తున్నారు. తెలుగు మాధ్యమం విద్యార్థులకు అన్ని తరగతుల పుస్తకాలు చాలా వరకు ముద్రితం కాలేదు.

*♦️ఎనిమిదో తరగతి ఒక్కటీ రాలేదు*
ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ ఈ మూడు మీడియాల్లో ఒక్కటంటే ఒక్క పుస్తకం ముద్రించలేదు. జులై 4 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. స్కూళ్ల ప్రారంభానికి మరో 25 రోజులే గడవు ఉంది. అయినా ఇప్పటి వరకు అన్ని పుస్తకాలు ముద్రితమై గోదాముకే చేరుకోకపోతే స్కూళ్ల పునఃప్రారంభం రోజున పుస్తకాల పంపిణీ ఎలా సాధ్యమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

 *♦️నెలాఖరుకు అన్నీ వస్తాయి*
- వనమా వజ్రబాబు, మేనేజరు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం

ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఇప్పటి వరకు అన్నిమాధ్యమాల్లో కలిపి 13 లక్షల పుస్తకాలు రాగా వాటిని ఎమ్మార్సీ కార్యాలయాలకు తరలిస్తున్నాం. నెలాఖరికల్లా మొత్తం పుస్తకాలు వస్తాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రైవేటు స్కూళ్లకు కూడా ఇండెంట్‌మేరకు ముద్రించి పంపుతాం.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "✍️పాఠ్యపుస్తకాలేవి?✍️📚* *♦️ఇండెంట్లో సగమూ రాలేదు.*"

Post a Comment