వేసవి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయ బదిలీలు
గవర్నర్‌పేట, జూన్ 6: వేసవి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు.
మున్సిపల్ పాఠశాలలను మున్సిపల్ పరిధి నుంచి పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలోకి తీసుకువస్తున్నట్లు మంత్రి చెప్పా.రు .
మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని, ఉన్నత పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నచోట మాత్రమే కిలోమీటరు లోపు
ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేస్తామని మంత్రి తెలిపారని వెల్లడించారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సు 62ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు
0 Response to "వేసవి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయ బదిలీలు"
Post a Comment